తెలంగాణ

telangana

Akhanda 50 days: థియేటర్​​లో ఫ్యాన్స్​తో కలిసి బాలయ్య సందడి!

By

Published : Jan 20, 2022, 9:20 PM IST

Akhanda 50 days celebrations: 'అఖండ' చిత్రం విడుదలై 50రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి.. హైదరాబాద్​లోని సుదర్శన్​ థియేటర్​లో సందడి చేశారు. అభిమానులతో కలిసి సినిమాను చూశారు. ఈ సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య. ఈ విజయం తెలుగు చలన చిత్ర విజయం అని పేర్కొన్నారు.

Balakrishna akhanda 50 days celebrations
Balakrishna akhanda 50 days celebrations

Akhanda 50 days celebrations: ఏ సినిమానైనా థియేటర్‌కు వచ్చి చూస్తేనే మజా ఉంటుందని అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన కీలక పాత్రలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం ‘అఖండ’ . ప్రగ్యాజైశ్వాల్‌ కథానాయిక. గతేడాది డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌కు విచ్చేసిన బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి ప్రేక్షకులతో కలిసి సినిమా చూశారు.

అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ.. "సమరసింహారెడ్డి’ తరువాత సుదర్శన్ థియేటర్‌కు వచ్చా. ‘అఖండ’ మూవీ విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అఖండ విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సినిమాను విజయవంతం చేసిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు. లక్షల మంది అభిమానులను సంపాదించుకోవడం గర్వంగా ఉంది. ఈ విజయం తెలుగు చలన చిత్ర విజయం. ప్రకృతి జోలికి వస్తే ఏమవుతుందో ‘అఖండ’ చూస్తే అర్థమవుతుంది. ప్రగ్యా జైశ్వాల్‌ అద్భుతంగా నటించింది. సినిమా విడుదలకు ముందే ‘అఖండ’ గురించి మాట్లాడుకున్నారు. సినిమాను థియేటర్‌కు వచ్చి చూస్తేనే మజా. జనవరి 21వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ‘అఖండ’ స్ట్రీమింగ్‌ కానుంది. అక్కడ కూడా సినిమాను ఆదరించాలి" అని అన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను మాట్లాడుతూ.. "అఖండ వందకు పైగా సెంటర్లలో 50 రోజులు ఆడటం ఒక సంచలనం. ఈ విజయం నందమూరి అభిమానులు, తెలుగు ప్రేక్షకులది. ఈ విజయాన్ని భగవంతుడికి, స్వర్గీయ ఎన్టీఆర్‌కు అంకితం ఇస్తున్నాం. శుక్రవారం నుంచి డిస్నీ+హాట్‌స్టార్‌లో ‘అఖండ’ వస్తుంది" అని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details