తెలంగాణ

telangana

TIFF: టొరంటో చిత్రోత్సవాల్లో తెలుగు నిర్మాత చిత్రం

By

Published : Sep 1, 2021, 7:01 AM IST

ప్రఖ్యాత టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021కు(Toronto international film festival 2021) తెలుగు నిర్మాత సునీత తాటి తీసిన 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' (Arrangements of Love movie) ఎంపికైంది. ఈ చిత్రోత్సవాలకు ఆసియా ఖండం నుంచి ఎంపికైన సినిమా ఇదే అని సునీత తెలిపారు.

Sunitha Tati
సునీత తాటి

ప్రఖ్యాత 46వ టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 2021కు(Toronto international film festival 2021) తెలుగు నిర్మాత సునీత తాటి తీసిన 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' (Arrangements of Love movie) ఎంపికైంది. ఇంటర్నేషనల్‌ ఫైనాన్సింగ్‌ ఫోరమ్‌ (ఐఎఫ్‌ఎఫ్‌) నుంచి ఈ చిత్రోత్సవాలకి వెళుతున్న.. ఆసియా ఖండం నుంచి ఎంపికైన సినిమా ఇదే అని సునీత తాటి ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్‌ 13, 14 తేదీల్లో చిత్రోత్సవాల్లో(TIFF) ప్రదర్శిస్తారని ఆమె తెలిపారు. గురు ఫిల్మ్స్‌ పతాకంపై విజయవంతమైన 'ఓ బేబి' మొదలుకొని పలు సినిమాల్ని నిర్మించారు సునీత తాటి.

ప్రఖ్యాత రచయిత టైమెరి ఎన్‌.మురారి రాసిన ఓ నవల ఆధారంగా 'అరెంట్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌'ని తెరకెక్కించారు. వేల్స్‌తో పాటు భారతదేశంలో చిత్రీకరణ జరిపారు. ఫిలిప్‌జాన్‌ దర్శకత్వం వహించారు.

"టైమెరి ఎన్‌.మురారి రాసిన నవలతో పదిహేనేళ్లుగా ప్రయాణిస్తున్నా.. తప్పిపోయిన తండ్రిని వెతుకుతూ వేల్స్‌కి చెందిన ఓ భారతీయుడు తన మాతృదేశానికి వెళతాడు. ఆ ప్రయాణంలో అతనెలాంటి పరిస్థితులని ఎదుర్కొన్నాడు? అనేది ఈ సినిమా కథ" అని పేర్కొన్నారు సునీత. ఇందులో భాగమైన సురేష్‌ ప్రొడక్షన్స్‌ అధినేత, నిర్మాత డి.సురేష్‌బాబు మాట్లాడుతూ "ప్రపంచ సినిమాలో భాగమయ్యే ప్రయత్నంలో 'అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌' ద్వారా తెలుగు నిర్మాత సినిమా మరో అడుగు ముందుకేసినట్టైంది" అని అన్నారు.

ఇదీ చూడండి:ఇన్‌స్టా ఖాతా తెరిచిన 'చంద్రముఖి'

ABOUT THE AUTHOR

...view details