ETV Bharat / sitara

ఇన్‌స్టా ఖాతా తెరిచిన 'చంద్రముఖి'

author img

By

Published : Aug 31, 2021, 9:26 PM IST

ప్రముఖ నటి జ్యోతిక ఇన్​స్టాగ్రామ్​ ఖాతా తెరిచింది. పెళ్లి తర్వాత విభిన్న పాత్రల్లో కనిపిస్తున్న ఆమె ఇంతవరకూ సామాజిక మాధ్యమాల్లో ఖాతా తెరవలేదు.

Jyothika
Jyothika

దక్షిణాది నటి జ్యోతికకు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంది. చిరంజీవితో 'ఠాగూర్', నాగార్జునతో 'మాస్‌', రజనీకాంత్‌తో 'చంద్రముఖి', కమల్‌హాసన్ తో 'రాఘవన్'.. ఇలా అగ్రహీరోలతో నటించి.. గుర్తింపు తెచ్చుకుంది. 2006లో నటుడు సూర్యతో వివాహం అనంతరం కొన్నేళ్లు సినిమాలకు దూరమైన ఆమె వ్యక్తిగత జీవితంలో బిజీగా ఉంది. ఇటీవలే మళ్లీ సినిమాల్లో సెకెండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించినామె ఇన్నేళ్లూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చింది. కాగా మంగళవారం (ఆగస్టు31న) జ్యోతిక 'ఇన్‌స్టాగ్రామ్‌'లో ఇంట్రీ ఇచ్చింది.

జ్యోతిక
కశ్మీర్​ అందాలను చూస్తూ
జ్యోతిక
కశ్మీర్​లో జ్యోతిక

ఈ సందర్భంగా తన తొలి పోస్ట్‌లో జాతీయ జెండా ఎగురవేస్తూ.. "హలో అందరికీ! సోషల్‌మీడియాలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. నా లాక్‌డౌన్‌ డైరీస్‌లో ఎన్నో పాజిటివ్‌ అంశాలున్నాయి. వాటిని మీతో షేర్ చేసుకుంటున్నా. భారతదేశం ఎంతో అందమైంది. స్వాతంత్య్ర దినోత్సవం నాడు నేను కశ్మీర్‌లోని సరస్సులు, హిమాలయాల్లో పర్యటించా. బీకాత్‌ ఆడ్వెంచర్స్‌ అనే బృందం.. సచిన్‌, రౌల్‌, అశ్విన్‌తోపాటు ముస్తాక్, రియాజ్‌తో 70కి.మీ ట్రెక్కింగ్‌ చేశా. మనం జీవించడం ప్రారంభించకపోతే జీవితం ఒక ఉనికి మాత్రమే! జైహింద్‌" అని రాశారు.

జ్యోతిక
ట్రెక్కింగ్​ టీంతో జ్యోతిక

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.