Akhanda Fans Celebrations: జై బాలయ్య.. జైజై బాలయ్య.. 'అఖండ' రిలీజ్ సందర్భంగా థియేటర్లు అన్నింటిలో మార్మోగిన నినాదమిది. బాలయ్య కటౌట్‌కు కొబ్బరికాయలు కొట్టి, హారతులు పట్టారు. వెండితెర మీద నటసింహాన్ని చూసిన అభిమానుల ఆనందానికి అంతులేదు. 'అఖండ' విజయాన్ని తమదైన శైలిలో సంబరాలు చేసుకున్నారు. ఇదంతా మన తెలుగు రాష్ట్రాలకే పరిమితమైందని అనుకుంటే పొరపాటే. ఒవర్సీస్లోని థియేటర్లలో కూడా 'అఖండ'ను చూసి ఫ్యాన్స్ ఖుష్ అయ్యారు. జై బాలయ్య నినాదాలతో రచ్చ రచ్చ చేశారు.
హౌస్‌ఫుల్
బాలకృష్ణ-బోయపాటి శీను హిట్ కాంబినేషన్‌కు పెట్టింది పేరు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత వీరి కాంబోలో వచ్చిన చిత్రం అఖండ. అందులోనూ బాలయ్య నుంచి ఈ మాస్ జాతరలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది. మరి అలాంటి సమయంలో వచ్చిన ఈ చిత్రానికి అభిమానుల సంబరాలు మామూలుగా ఉంటాయా? 'అఖండ' మోత, అభిమానుల కేరింతలతో థియేటర్లు దద్దరిల్లాయి. బుకింగ్ కౌంటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి. మాస్, క్లాస్ అని తేడా లేకుండా అన్ని సెంటర్లు ప్రేక్షకులతో కిక్కిరిశాయి.
కాలిఫోర్నియాలో బాలయ్య కటౌట్‌కు కొబ్బరికాయలు కొట్టిన అభిమానులు
సింపుల్‌గా బాలయ్య..
'అఖండ' విజయానికి అభిమానులు పూనకాలతో ఊగిపోతూ రకరకాలుగా సంబరాలు చేసుకుంటున్నారు. కానీ బాలయ్య మాత్రం ఈ వేడుకలను దూరంగా ఉన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఆక్సిజెన్ జనరేటర్‌ను ప్రారంభించారు. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాలయ్య తన పని తాను చేసుకుపోతున్నారంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ప్రశంసిస్తున్నారు.
ఆక్సిజెన్ జెనరేటర్‌ను ప్రారంభించిన బాలయ్య
తల్లిదండ్రుల విగ్రహాలకు నమస్కరిస్తూ..
ఆక్సిజెన్ జెనరేటర్‌ను ప్రారంభించిన బాలయ్య
ఇదీ చూడండి :Akhanda review: బాలయ్య 'అఖండ' ట్విట్టర్ రివ్యూ