Akhanda first day collection worldwide: అగ్రకథానాయకుడు నందమూరి బాలకృష్ణ.. బాక్సాఫీస్ దగ్గర మరోసారి తన సత్తా చాటారు. స్వదేశంలోనే కాదూ.. ఓవర్సిస్లోనూ దుమ్మురేపింది 'అఖండ'. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తొలిరోజే భారీ వసూళ్లు చేసింది.
- అమెరికాలో రూ.3.21 కోట్లు
- కెనడాలో రూ.12.99 లక్షలు
- యూకేలో రూ.32.58 లక్షలు
- ఆస్ట్రేలియాలో రూ. 52.15 లక్షలు
భారత్లో 'అఖండ'గా గర్జించి, తొలిరోజే దాదాపు రూ.31 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వసూలు చేశారు బాలయ్య. సినీ కెరీర్లో తొలిరోజు ఈ స్థాయిలో కలెక్షన్లు రావడం ఇదే తొలిసారి. దీని బట్టే బాలయ్య సత్తా ఏంటో మరోసారి నిరూపితమైంది.
ఏపీలో ఓవైపు టికెట్ ధరలు తగ్గించడం, మరోవైపు బెన్ఫిట్ షోలు లేకపోవడం.. వీటికి తోడు కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ భయం.. ఇలా ఎన్నో అంశాలు ఉన్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర బాలయ్య మాస్ ర్యాంపేజ్ను అవేవి అస్సలు నిలువరించలేకపోయాయి. నటసింహం సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేశాయి. దీంతో అభిమానులు థియేటర్ల దగ్గర, సోషల్ మీడియాలో తెగ పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి ముందే వచ్చేసిందని సంబరపడుతున్నారు.
ఇదీ చూడండి:బాలయ్య 'అఖండ' సినిమాకు తొలిరోజు భారీ వసూళ్లు