తెలంగాణ

telangana

సాయిధరమ్​తేజ్​పై కేసు నమోదు

By

Published : Sep 11, 2021, 1:20 PM IST

రోడ్డు ప్రమాదానికి గురైన మెగాహీరో సాయిధరమ్​ తేజ్​పై(Saidharam tej accident) కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్​ చేసినందుకు కేసు పెట్టినట్లు తెలిపారు పోలీసులు.

sai
సాయి

రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న మెగాహీరో సాయిధరమ్​ తేజ్‌పై(Saidharam tej accident) కేసు నమోదు చేశారు హైదరాబాద్​ రాయదుర్గం పొలీసులు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసినందుకు ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు పెట్టారు. తేజ్​ నడిపిన బండిని స్వాధీనం చేసుకుని, రాయదుర్గం పీఎస్​కు తరలించారు.

ఎలా జరిగింది?

స్పోర్ట్స్‌ బైక్‌(sai dharam tej bike accident cctv footage)నడుపుతున్న సాయి ధరమ్‌.. ఒక్కసారిగా బైక్‌(sai dharam tej accident bike cctv) అదుపు తప్పి కింద పడిపోయారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధిలో ఐకియా సమీపంలో నిన్న రాత్రి(సెప్టెంబరు 10) ఈ ప్రమాదం జరిగింది. తీగల వంతనె వద్ద నుంచి ఐకియా వైపు వెళ్తుంగా ఘటన సంభవించింది. ప్రమాదంలో ఆయన కంటి పైభాగం సహా ఛాతీ భాగంలో గాయలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని... కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ అయిందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు.

సాయి ధరమ్​ను పరామర్శించేందుకు ఆస్పత్రికి పలువురు సినీప్రముఖులు తరలివస్తున్నారు. వీరలో మెగా కుటుంబం సహా ప్రకాశ్​ రాజ్​, శ్రీకాంత్, మంచులక్ష్మీ, రాశీఖన్నా తదితురులు ఉన్నారు.

ఇదీచూడండి: సాయిధరమ్​ తేజ్​ హెల్త్ ​బులెటిన్​ విడుదల​

ABOUT THE AUTHOR

...view details