ETV Bharat / sitara

సాయిధరమ్​ తేజ్​ హెల్త్ ​బులెటిన్​ విడుదల​

author img

By

Published : Sep 11, 2021, 7:10 AM IST

Updated : Sep 11, 2021, 10:25 AM IST

రోడ్డు ప్రమాదానికి గురైన మెగాహీరో సాయిధరమ్​ తేజ్​(sai dharam tej accident) ఆరోగ్య పరిస్థితిపై హెల్త్​ బులెటిన్​ విడుదల చేశారు వైద్యులు. తేజ్​ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపిన వైద్యులు.. అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వెల్లడించారు.

saidharam tej
సాయిధరమ్​ తేజ్​

రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితిపై(sai dharam tej accident) వైద్యులు తాజా హెల్త్‌ బులెటిన్‌(sai dharam tej health condition) విడుదల చేశారు. 'సాయి తేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. ఈ రోజు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం' అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు.

సాయి ఆరోగ్య పరిస్థితిపై రేపు మరో బులెటిన్‌ విడుదల చేస్తామని తెలిపారు. మరోవైపు సాయి తేజ్‌ను పలువురు సినీ నటులు పరామర్శిస్తున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ తదితరులు సాయితేజ్‌ను ఈ ఉదయం పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

ఎలా జరిగింది?

స్పోర్ట్స్‌ బైక్‌(sai dharam tej bike accident cctv footage)నడుపుతున్న సాయి ధరమ్‌.. ఒక్కసారిగా బైక్‌(sai dharam tej accident bike cctv) అదుపు తప్పి కింద పడిపోయారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధిలో ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. తీగల వంతనె వద్ద నుంచి ఐకియా వైపు వెళ్తుంగా ఘటన సంభవించింది. ప్రమాదంలో ఆయన కంటి పైభాగం సహా ఛాతీ భాగంలో గాయలయ్యాయి. ప్రస్తుతం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని... కాలర్‌ బోన్‌ ఫ్యాక్చర్‌ అయిందని, ఆందోళన చెందాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలన్నారు.

saidharam tej
గాయపడిన సాయి ధరమ్​ తేజ్​

తప్పిన ముప్పుతో

వాహనం నడుపుతున్న సాయి ధరమ్‌ శిరస్త్రాణం, చేతి గ్లౌజులు ధరించి ఉండటం వల్ల ముప్పు తప్పింది. వాహనం కింద పడిపోవడాన్ని గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న108 సిబ్బంది మొదట సాయి ధరమ్‌ను గుర్తించకుండానే.. ప్రాథమిక చికిత్స అందించారు. ఆ సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్టు తెలిపారు. కొద్ది సేపటి తర్వాత నటుడు సాయి ధరమ్‌ తేజ్‌గా గుర్తించి.. పోలీసులకు సమాచారం అందించారు.

సాయి ధరమ్​ తేజ్​.. రోడ్డు ప్రమాదం వీడియో

ఆస్పత్రికి తరలివచ్చిన సినీ ప్రముఖులు

పోలీసులు ఆయనను మొదట మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రికి తరలించారు. నటుడు పవన్‌ కల్యాణ్‌, సినీ దర్శకుడు త్రివిక్రమ్‌, అల్లు అరవింద్‌, సురే‌శ్​ కొండేటి తదితరులు ఆసుపత్రికి తరలి వచ్చారు. వైద్యులతో మాట్లాడి.. సాయి ధరమ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కొద్ది సేపటి తర్వాత ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో గాయపడిన సాయి ధరమ్‌ క్రమంగా కోలుకుంటున్నట్టు అల్లు అరవింద్‌ తెలిపారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిపై అర్ధరాత్రి అపోలో వైద్యులు బులెటిన్‌ విడుదల చేశారు. "సాయి ధరమ్‌కు ప్రమాదంలో కాలర్‌బోన్‌ ఫ్యాక్చర్‌ అయింది. స్వల్పంగా గాయపడ్డారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉండాలి. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోంది" అని వైద్యులు తెలిపారు.

ప్రమాదం గురించి తెలుసుకున్న అభిమానులు భారీగా అపోలో ఆసుపత్రికి వద్దకు తరలి వచ్చారు. తోపులాట జరగడం వల్ల రంగంలోకి దిగిన పోలీసులు అభిమానులను అక్కడి నుంచి పంపించి వేశారు.

ఇదీ చూడండి: హీరో సాయిధరమ్‌ తేజ్‌కు రోడ్డు ప్రమాదం

Last Updated : Sep 11, 2021, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.