తెలంగాణ

telangana

ప్రమోషన్స్​లో నయా ఫార్ములా.. 10 టీజర్లతో 'బ్రహ్మాస్త్ర'

By

Published : May 27, 2021, 5:28 PM IST

Updated : May 27, 2021, 6:27 PM IST

'లేట్​గా వచ్చినా.. లేటెస్ట్​గా రావాలి' అనేది ప్రజల్లో నానుడి. ఇప్పుడదే సూత్రాన్ని 'బ్రహ్మాస్త్ర' చిత్రబృందం అనుసరించనుంది. ఈ సినిమా రిలీజ్​కు ముందు ప్రమోషన్స్​లో భాగంగా 10 టీజర్లు, 13 మోషన్​ పోస్టర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ విధంగా సినిమా గురించి ప్రేక్షకులకు మరింత దగ్గరచేయాలని చిత్రయూనిట్​ భావిస్తోంది.

10 teaser cuts 13 motion posters For Brahmastra movie Promotions
ప్రమోషన్స్​లో నయా ఫార్ములా.. 10 టీజర్లతో 'బ్రహ్మాస్త్ర'

బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో 'బ్రహ్మాస్త్ర' ఒకటి. రణ్‌బీర్, అలియాభట్‌ ప్రధానపాత్రల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్‌తో పాటు.. టాలీవుడ్​ ప్రముఖ కథానాయకుడు నాగార్జున నటిస్తున్నారు. అనేక వాయిదాల తర్వాత దీని చిత్రీకరణ ఓ కొలిక్కివచ్చింది.

2018లో మొదలైన ఈ సినిమా షూటింగ్‌ 2021కి దాదాపు పూర్తైయినట్లేనని చెప్పవచ్చు. కాకపోతే ఇక కొంచెం ప్యాచ్‌వర్క్‌ మిగిలింది. అయితే గ్రాఫిక్స్‌ వర్క్‌ ఇంకా మిగిలే ఉందని తెలుస్తోంది. ఇప్పుడీ సినిమా పబ్లిసిటీని బలంగా చేయాలని నిర్ణయించారు నిర్మాతలు. ఇందుకోసం 10టీజర్లు, 13 మోషన్‌ పోస్టర్లు సిద్ధం చేస్తున్నారు.

టీజర్‌ కట్‌లను ఇప్పటికే సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేట్‌(సెన్సార్‌) క్లీన్‌ 'యూ' సర్టిఫికేట్‌ వచ్చినట్లు తెలుస్తోంది. 2021 ద్వితీయార్ధంలో ప్రచారాన్ని మొదలు పెట్టాలని యోచిస్తున్నారు. ఈ టీజర్లకు తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ భాషల్లో డబ్బింగ్‌ పనులూ పూర్తయ్యాయి. అక్కడి సెన్సార్‌ బోర్డ్‌ల నుంచి అనుమతులు పొందిన వెంటనే ప్రచారం ప్రారంభం కానుంది. ఈ సినిమాను 2021 చివర్లో విడుదల చేస్తారని బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.

ఇదీ చూడండి:రూ.300 కోట్లు దాటిన బ్రహ్మాస్త్ర బడ్జెట్!

Last Updated :May 27, 2021, 6:27 PM IST

ABOUT THE AUTHOR

...view details