తెలంగాణ

telangana

వాట్సాప్‌లో ఇక డబుల్ ధమాకా.. ఒకే అకౌంట్.. రెండు స్మార్ట్‌ఫోన్లలో!

By

Published : Jul 10, 2022, 3:29 PM IST

Whatsapp Account In Two Phones: ప్రముఖ మెసేజింగ్​ యాప్​ వాట్సాప్‌.. త్వరలోనే అదిరిపోయే ఫీచర్​ను తమ యూజర్లకు​ అందుబాటులోకి తీసుకురానుంది. ప్రైమరీ మొబైల్‌లోని వాట్సాప్‌ అకౌంట్‌ను మరో స్మార్ట్‌ఫోన్‌కు లింక్ చేసి వాడుకునేలా ఫీచర్​ను​ తీసుకొస్తోంది.

WhatsApp Will Allow Users To Use the Same Account Across Two Smartphones, Soon
WhatsApp Will Allow Users To Use the Same Account Across Two Smartphones, Soon

Whatsapp Account In Two Phones: ప్రపంచంలో నిత్యం కోట్లాది మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌. యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లోనే ఇతరులతో ఎక్కువగా చాట్ చేస్తుంటారు. అవసరమైన ఫొటోలు, వీడియోలు, ఫైల్స్​ను షేర్ కూడా​ చేసుకుంటారు. అందుకే తమ యూజర్ల కోసం వాట్సాప్​.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే మరో అదిరిపోయే ఫీచర్​ను తీసుకురానుంది.

ఇటీవలే వాట్సాప్​ మల్టీ డివైజ్​ సపోర్ట్ ఫీచర్​ను​​ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్​, ఐఓఎస్​ యూజర్లందరికీ ఈ ఫీచర్​ అందుబాటులోకి వచ్చింది. వాట్సాప్‌ అకౌంట్ ఉన్న ప్రైమరీ మొబైల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా.. ఇంతకు ముందే వాట్సాప్ వెబ్‌ ద్వారా కనెక్ట్ అయిన కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో మెసేజ్‌లు రిసీవ్​ చేసుకోవచ్చు, సెండ్ చేయవచ్చు. ఇలా మొత్తంగా ఒకేసారి ఓ ఫోన్‌, నాలుగు డివైజ్‌ల్లో వాట్సాప్‌ అకౌంట్ వాడుకోవచ్చు. అయితే తాజాగా ఎంతోమందికి ఉపయోగపడే మరో ఫీచర్​ను తీసుకురానుంది ఆ సంస్థ. తమ ప్రైమరీ మొబైల్‌లో ఉన్న వాట్సాప్‌ అకౌంట్‌ను ఇంకో ఫోన్‌లో వాడుకునే ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొస్తోంది. ఈ ఫీచర్‌ ద్వారా వాట్సాప్‌ అకౌంట్‌ను మరో ఫోన్‌కు లింక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు.

ప్రైమరీ మొబైల్‌లోని వాట్సాప్‌ అకౌంట్‌ను మరో మొబైల్‌కు లింక్ చేసుకునే ఫీచర్.. వాట్సాప్​ బీటా 2.22.15.13 అప్డేట్​లో కనిపించిందని వాట్సాప్‌ ఫీచర్లను ట్రాక్ చేసే డబ్ల్యూఏబీటాఇన్ఫో (WABetaInfo) వెల్లడించింది. వాట్సాప్‌ అకౌంట్ ఉన్న ప్రైమరీ మొబైల్‌ నుంచి లింక్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్​ దశలోనే ఉందని, త్వరలోనే అందుబాటులోకి రానుందని పేర్కొంది.

ఇవీ చదవండి:ఆన్​లైన్​ స్టేటస్​.. ఫ్లాష్‌కాల్‌ వెరిఫికేషన్‌ .. వాట్సాప్​లో అదిరే ఫీచర్స్!

వాట్సాప్​లో మరో ఫీచర్​.. మెసేజ్​ చేసి రెండు రోజులైనా డిలీట్​!

ABOUT THE AUTHOR

...view details