ETV Bharat / science-and-technology

వాట్సాప్​లో మరో ఫీచర్​.. మెసేజ్​ చేసి రెండు రోజులైనా డిలీట్​!

author img

By

Published : Jul 3, 2022, 1:31 PM IST

Whatsapp New Feature: వాట్సాప్​లో ఎవరికైనా తప్పుగా మెసేజ్​ పంపేశారా? అది కూడా రెండు గంటలు తర్వాత చూసుకున్నారా? అయ్యో డిలీట్​ చేయడం కుదరదు కదా అని బాధపడొద్దు. ఎందుకంటే ఇప్పుడు మెసేజ్​ చేసి రెండు రోజులు అయినా కూడా డిలీట్​ చేయవచ్చు. అందుకు సంబంధించిన కొత్త ఫీచర్​ను వాట్సాప్​ త్వరలోనే తీసుకురాబోతుంది.

whatsapp new feature
whatsapp new feature

Whatsapp Delete For EveryOne Option: ప్రపంచంలో ఎక్కువ మంది వాడే మెసేజింగ్ యాప్ వాట్సాప్‌. నిత్యం కోట్లాది మంది యూజర్లు ఈ ప్లాట్‌ఫామ్‌లోనే ఇతరులతో చాట్ చేస్తుంటారు. అవసరమైన ఫొటోలు, వీడియోలు, ఫైల్స్​ను షేర్​ చేసుకుంటారు. అయితే.. చాటింగ్​​ చేస్తున్న సమయంలో మీరు ఎప్పుడైనా ఓ మెసేజ్​.. ఒకరికి పంపబోయి మరొకరికి పంపారా? పోనీ పంపాక రెండు గంటలు తర్వాత చూసుకున్నారా? అప్పుడు అబ్బా.. చూసుకోలేదే అని బాధపడక్కర్లేదు. ఎందుకంటే వాట్సాప్​ త్వరలోనే కొత్త ఫీచర్​ను తీసుకొస్తుంది. మెసేజ్​ చేసి రెండు రోజులు అయినా డిలీట్​ చేసుకునే అవకాశం కల్పిస్తుంది.

వాట్సాప్​ చాట్​లో 'డిలీట్​ ఫర్​ ఎవ్రీవన్'​ ఫీచర్​ను 2017లో అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదట.. ఆ ఫీచర్​ను ఎనిమిది నిమిషాలకు మాత్రమే పరిమితం చేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు 1 గంట 8 నిమిషాల 16 సెకన్ల వరకు డిలీట్​ చేసే అవకాశాన్నిచ్చింది. ఇప్పుడు ఈ ఫీచర్​ను​ ఇంకాస్త సమయానికి పెంచుదామని వాట్సాప్​ యోచిస్తోంది.

కొత్త ఫీచర్​ వచ్చాక వాట్సాప్​లో పంపిన మెసేజ్​ను 56 గంటల తర్వాత డిలీట్​ చేసుకోవచ్చు. అంటే రెండున్నర రోజులైనా డిలీట్​ చేసేయొచ్చు. ఈ ఫీచర్​ అందుబాటులోకి వస్తే చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్​ టెస్టింగ్​ మోడ్​లో ఉంది. మరికొద్దిరోజుల్లోనే అందుబాటులోకి రానుంది. దీంతో పాటు మరో ఫీచర్​ను ​కూడా వాట్సాప్​ తీసుకురానుంది. మీరు అడ్మిన్​గా ఉన్న గ్రూప్​​లోని ఏ మెసేజ్​నైనా డిలీట్​ చేసే అవకాశాన్ని కల్పించనుంది.

ఇవీ చదవండి: ఇన్​స్టా సరికొత్త ఫీచర్.. రీల్స్​గా మారనున్న వీడియోలు!

వాట్సాప్​ కాల్స్​ రికార్డ్​ చేయడం ఎలాగో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.