తెలంగాణ

telangana

Whatsapp App: మీ వాట్సాప్ ఇకపై ఒకేసారి నాలుగు డివైజ్​ల్లో..

By

Published : Sep 20, 2021, 1:46 PM IST

WhatsApp Multi-device Features

మీరు వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? అయితే ఈ ఫీచర్ మీకోసమే. మల్టీ డివైజ్​ ఆప్షన్ పేరుతో ఆప్షన్​ బీటా వెర్షన్​ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకీ దీనిని ఎక్కడ ఉపయోగించొచ్చు, ఎక్కడ ఉపయోగించకూడదు?

కొద్ది రోజుల క్రితం మల్టీ డివైజ్‌ ఫీచర్‌ బీటా వెర్షన్‌ను వాట్సాప్‌ యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ ఫీచర్‌ను పరీక్షించదలచుకున్న యూజర్స్ వాట్సాప్‌లో లింక్‌ డివైజ్‌ లేదా వెబ్‌ వాట్సాప్‌లోకి వెళితే మల్టీ డివైజ్‌ బీటా పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి బీటా వెర్షన్‌ను పరీక్షించవచ్చు. మరి మల్టీ డివైజ్‌ ఫీచర్‌తో యూజర్స్ ఏమేం చేయొచ్చు.. ఏం చెయ్యలేరు అనేది చూద్దాం.

ఏం చేయొచ్చు

ఈ ఫీచర్‌తో యూజర్స్‌ ఒకేసారి నాలుగు డివైజ్‌లలో లాగిన్ కావచ్చు. గతంలో కేవలం వాట్సాప్‌ యాప్‌తోపాటు వాట్సాప్‌ వెబ్‌లో మాత్రమే లాగిన్ అవ్వగలిగేవారు. మరో డివైజ్‌లో లాగిన్‌ కావాలంటే అంతకు ముందు డివైజ్‌ నుంచి లాగవుట్ చేయాల్సిందే. అలానే మల్టీ డివైజ్‌ పీచర్‌తో నాలుగు డివైజ్‌లలో వాట్సాప్‌ లాగిన్ అయిన తర్వాత ప్రైమరీ మొబైల్‌కు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పటికీ మిగిలిన నాలుగు డివైజ్‌లలో వాట్సాప్ ఉపయోగించవచ్చు. ఒకవేళ వరుసగా 14 రోజులపాటు ప్రైమరీ డివైజ్‌ నాలుగు డివైజ్‌లతో అనుసంధానం కాకపోతే వాటిలోంచి వాట్సాప్‌ ఆటోమేటిగ్గా లాగవుట్‌ అయిపోతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ బీటా వెర్షన్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్స్‌కు అందుబాటులో ఉంది.

వాట్సాప్ మల్టీ డివైజ్ ఫీచర్

ఏం చెయ్యలేమంటే

మల్టీ డివైజ్‌ ఫీచర్‌ ద్వారా లాగిన్‌ అయిన యాప్‌ లేదా డెస్క్‌టాప్‌ డివైజ్‌ల నుంచి ఒకేసారి కాల్స్‌ చెయ్యలేరు. అలానే ఈ ఫీచర్‌ ద్వారా కనెక్ట్ అయిన డివైజ్‌లకు కాల్స్ రావు. లైవ్‌ లొకేషన్స్‌, కంపానియన్ డివైజ్‌లను చూడడటం, చాట్‌లను పిన్‌ చేయడం, గ్రూప్‌లలో జాయిన్ కావడం, గ్రూప్‌లను చూడటం, గ్రూప్‌లలోకి ఇన్వైట్ చేయడం వంటివి చేయలేరు. ఇక వాట్సాప్‌ బిజినెస్ యూజర్స్ తమ ఖాతాల పేర్లు, లేబల్స్‌ను వాట్సాప్‌ వెబ్‌ లేదా డెస్క్‌టాప్‌ నుంచి ఎడిట్ చేయలేరు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details