వాట్సాప్​ సరికొత్త ఫీచర్​.. ఇకపై మరింత ప్రైవసీ!

author img

By

Published : Sep 7, 2021, 4:00 PM IST

WhatsApp

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్​(whatsapp new features)తో వినియోగదారుల ముందుకు రాబోతుంది. ఈ అప్​డేట్​తో యూజర్స్​ గోప్యత(whatsapp privacy) విషయంలో మరింత ముందడుగు వేసినట్లు అవుతుంది.

ఎల్లప్పుడూ వినియోగదారులకు కొత్త కొత్త అప్​డేట్స్​ ఇస్తూ వారిని ఆకర్షిస్తుంటుంది ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్. తాజాగా మరోసారి ఓ సరికొత్త ఫీచర్​తో(whatsapp new features)​ రాబోతుంది. దీని వల్ల వినియోగదారులు లాస్ట్ సీన్, అబౌట్, ప్రొఫైల్ పిక్చర్​ను వారు కోరుకున్న కాంటాక్ట్​లకు మాత్రమే అందుబాటులో ఉంచుకోవచ్చు.

ఎలా ఉండబోతుంది?

ప్రొఫైల్ పిక్చర్(who is checking my dp on whatsapp)​ను కొందరికే అందుబాటులో ఉంచడం ప్రస్తుతం కుదరడం లేదు. మీ డీపీని పరిమిత మందికే పెట్టుకునే ఆప్షన్ లేదు. మీ డీపీ అందరికీ కనిపించకూడదు అంటే కేవలం మీ మొబైల్​లో సేవ్ చేసుకున్న కాంటాక్ట్​లు మాత్రమే చూసేలా ఆ డీపీని పెట్టుకునే వీలు ఉంది. ఒకవేళ ఓ వ్యక్తికి మీ ఫొటో కనిపించకూడదు అంటే అతడిని బ్లాక్ చేయడమే మార్గం. అయితే ఇప్పుడు ఈ కొత్త అప్​డేట్​తో మీ వాట్సాప్ కాంటాక్ట్​ లిస్టులో మీరు కోరుకున్న కొందరికే డీపీ కనిపించేలా చేయొచ్చు. ఈ ఫీచర్​ ఒక ప్రొఫైల్ పిక్చర్​కే కాక లాస్ట్ సీన్(whatsapp last seen check), అబౌట్​కు కూడా వర్తిస్తుంది. అంటే ఇకపై డీపీ, లాస్ట్​ సీన్, అబౌట్​లను మీరు ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే కనిపించేలా చేసుకునే వీలు రాబోతోంది.

అయితే మీరు ఏ కాంటాక్ట్​ నుంచి అయితే మీ ఫొటో, లాస్ట్ సీన్, అబౌట్​ విషయంలో ప్రైవసీ కోరుకుంటున్నారో.. వారికి సంబంధించిన డీపీ, లాస్ట్ సీన్, అబౌట్​ కూడా మీకు కనిపించదు. ఈ విషయం ఇప్పటికే వాట్సాప్ వినియోదగారులకు తెలుసు. ప్రస్తుతం ఈ ఫీచర్​ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ కొత్త అప్​డేట్​తో వినియోగదారుల గోప్యత(whatsapp privacy) విషయంలో మరింత ముందడుగు వేసినట్లు అవుతుంది.

ఇవీ చూడండి: షార్ట్​కట్​ ఫీచర్​తో వాట్సాప్ పేమెంట్ మరింత ఈజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.