తెలంగాణ

telangana

దారుణం: కన్న కొడుకును కడ తేర్చిన తల్లి

By

Published : Oct 26, 2020, 3:41 PM IST

ఏపీ విశాఖ జిల్లా మధురవాడలో దారుణం జరిగింది. చెడు వ్యసనాలకు బానిసైన కుమారుడి వేధింపులు తాళలేక అతనిని హతమార్చింది తల్లి. వివరాల్లోకి వెళ్తే..

mother-killed-son-in-visakha-madhuravada
దారుణం: కన్న కొడుకును కడ తేర్చిన తల్లి

చెడు వ్యసనాలకు బానిసైన కుమారుడిని ఓ తల్లి కడ తేర్చింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ జిల్లా మధురవాడలో చోటుచేసుకుంది. మధురవాడలోని మారికవలస న్యూకాలనీలో బ్లాక్‌ నెం 144, ఎస్‌ఎఫ్‌3లో కోట్ల శ్రీను, మాధవి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి అనిల్‌(18)తో పాటు కుమార్తె ఉన్నారు.

చెడు వ్యసనాలకు బానిసైన అనిల్ డబ్బులివ్వమని తల్లిదండ్రులను రోజూ వేధించేవాడు. ప్రతి రోజూ బయట వ్యక్తులతో గొడవ పడటంతో పాటు తల్లిదండ్రులపైనా భౌతిక దాడులకు దిగేవాడు. దీంతో విసిగిపోయిన తల్లి మాధవి.. ఆదివారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న అనిల్‌ ఛాతీపై గ్యాస్ ‌సిలిండర్‌తో కొట్టి హత్య చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

దారుణం: కన్న కొడుకును కడ తేర్చిన తల్లి

ఇదీ చదవండి:ధరణి పోర్టల్‌పై తహసీల్దార్లు, నయాబ్ తహసీల్దార్లకు రేపు శిక్షణ

ABOUT THE AUTHOR

...view details