తెలంగాణ

telangana

పెళ్లయిన మూడు నెలలకే వివాహిత ఆత్మహత్య..

By

Published : Dec 4, 2020, 5:22 AM IST

సంగారెడ్డి జిల్లా చిట్కుల్​లో నాగార్జునకాలనీలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకొంది. పెళ్లయిన మూడు నెలలకే బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలి స్వగ్రామం మహబూబ్​నగర్​ జిల్లా కోయిలకొండ మండలం దార్లపాడు.

women suicide
పెళ్లయిన మూడు నెలలకే వివాహిత ఆత్మహత్య..

పెళ్లయిన మూడు నెలలకే ఓ వివాహిత తనువు చాలించింది. భర్త విధులకు వెళ్లివచ్చేసరికే ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. సంగారెడ్డి జిల్లా చిట్కుల్​లో ఈ ఘటన జరిగింది.

పటాన్​చెరు మండలం చిట్కుల్​లోని నాగార్జున కాలనీకి పదిహేను రోజుల క్రితం రాఘవేంద్ర, సుకన్య దంపతులు నివాసం ఏర్పాటుచేసుకున్నారు. కర్థనూరు సమీపంలోని ఎంఎస్ఎన్ పరిశ్రమలో రాఘవేంద్ర కార్మికుడిగా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం భర్త విధులకు వెళ్లగా.. ఇంట్లో కిటికీ చువ్వలకు ఉరివేసుకొని సుకన్య ఆత్మహత్యకు పాల్పడింది.

మృతురాలి స్వగ్రామం మహబూబ్​నగర్​ జిల్లా కోయిలకొండ మండలం దార్లపాడు. ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసునమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీచూడండి:ప్రేమ,స్నేహం పేరుతో వంచన... ప్రతిపాదన నిరాకరిస్తే పైశాచికత్వం..!

ABOUT THE AUTHOR

...view details