తెలంగాణ

telangana

నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు

By

Published : Nov 3, 2020, 7:01 PM IST

నాగర్​ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లోని పలు తండాల్లో ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 50 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకుని.. నలుగురు నిందితులపై కేసులు నమోదు చేశారు.

exise Officers' raids on Natusara spots in nagarkurnool district
నాటుసారా స్థావరాలపై అధికారుల దాడులు

నాగర్​ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లోని ఏన్మన్ బెట్ల తండా, ఎంగంపల్లి తండా, జొన్నలబొగడ తండాల్లో జిల్లా టాస్క్​ఫోర్స్​ అధికారులు, కొల్లాపూర్ ఆబ్కారీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. సుమారు 50 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా 500 లీటర్ల నాటుసారాకు ఉపయోగపడే బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు.

రెండు ద్విచక్ర వాహనాలను సీజ్​ చేసి.. నలుగురు నిందితులపై కేసు నమోదు చేశారు. ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా.. అమ్మినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.

ఇదీ చూడండి.. కారు దొంగతనం కేసులో మాజీ ఎమ్మెల్యేపై చీటింగ్​ కేసు

ABOUT THE AUTHOR

...view details