తెలంగాణ

telangana

మోండామార్కెట్​లో రసాయనిక పేలుడు... త్రుటిలో తప్పిన ప్రమాదం

By

Published : Oct 25, 2020, 10:01 AM IST

Updated : Oct 25, 2020, 10:40 AM IST

చెత్తకుండీలో రసాయనిక పదార్థం పేలిన ఘటన హైదరాబాద్​ మోండామార్కెట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోటుచేసుకుంది. ఘటనలో రాజు అనే వ్యక్తి చేయి విరిగిపోగా.. చికిత్స నిమిత్తం అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

chemical blast at monda market in hyderabad
మోండామార్కెట్​ వద్ద చెత్తకుండీలో రసాయనిక పేలుడు

హైదరాబాద్​ మోండా మార్కెట్​ పరిధిలోని ముత్యాలమ్మ ఆలయం వద్దనున్న చెత్తకుండీలో ఒక్కసారిగా రసాయనిక పేలుడు జరిగింది. స్థానికంగా ఉండే రాజు అనే వ్యక్తి చెత్త వేసేందుకు అక్కడికి వచ్చి చెత్తకుండీలో చెేయి పెట్టిన వెంటనే ఒక్కసారిగా పేలుడు జరిగింది.

ప్రమాదంలో రాజు చేయి విరిగిపోయింది. స్థానికులు వెంటనే స్పందించి అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని చెత్త కుండీని పరిశీలిస్తున్నారు. రసాయనిక పదార్థం పేలడంపై ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండిఃదసరా వేళ బస్సులు లేక ప్రయాణికులు ఇక్కట్లు

Last Updated : Oct 25, 2020, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details