తెలంగాణ

telangana

మొక్కలతో వ్యాక్సిన్ తయారీ.. ఐదు కొవిడ్​ వేరియంట్లకు చెక్​!

By

Published : May 7, 2022, 12:26 PM IST

plant based covid vaccine: కొవిడ్​కు మరో కొత్త రకం టీకా అందుబాటులోకి రానుంది. మొక్కల ఆధారంగా తయారైన వ్యాక్సిన్ అయిదు రకాల వేరియంట్లకు వ్యతిరేకంగా సుమారు 70 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు పరిశోధనల్లో తేలింది. కెనడాకు చెందిన మెడికాగో సంస్థ ఈ వ్యాక్సిన్​ను రూపొందించింది.

plant based covid vaccine
మొక్కల ఆధారంగా తయారైన కొత్త కొవిడ్‌ వ్యాక్సిన్‌

plant based covid vaccine: మొక్కల ఆధారంగా తయారైన కొత్త కొవిడ్‌ వ్యాక్సిన్‌... అయిదు రకాల కరోనా వేరియంట్లకు వ్యతిరేకంగా సుమారు 70% సామర్థ్యంతో పనిచేస్తున్నట్టు క్లినికల్‌ పరీక్షల్లో తేలింది. కెనడాకు చెందిన మెడికాగో సంస్థ దీన్ని రూపొందించింది. 'ఏఎస్‌ఓ3' అనే పదార్థంతో.. మొక్కల ఆధారంగా ఉత్పత్తిచేసిన కరోనా వైరస్‌ మాదిరి పార్టికల్స్‌ (సీఓవీఎల్‌పీ)ను అడ్డుకునేలా దీన్ని తయారు చేసింది. మూడోదశ క్లినికల్‌ పరీక్షల్లో భాగంగా 85 చోట్ల, మొత్తం 24,141 మందిపై దీన్ని పరీక్షించి చూశారు.

21 రోజుల వ్యవధిలో రెండుసార్లు ఇంజెక్షన్‌ రూపంలో వారికి దీన్ని అందించారు. పలు లక్షణాలకు కారణమయ్యే అయిదు రకాల వేరియంట్లకు వ్యతిరేకంగా ఈ వ్యాక్సిన్‌ 69.5% పనితీరు కనబరుస్తున్నట్టు గుర్తించారు. మధ్య-తీవ్ర స్థాయి ఇన్‌ఫెక్షన్‌ను ఇది 74-78.8% మేర అడ్డుకుంటున్నట్టు తేల్చారు. ఈ కొత్త 'సీఓవీఎల్‌పీ+ఏఎస్‌03 వ్యాక్సిన్‌' తీసుకున్న వారెవరూ తీవ్రస్థాయి కొవిడ్‌కు గురికాలేదని పరిశోధకులు తెలిపారు. ప్లాసిబో తీసుకున్నవారితో పోలిస్తే.. ఈ టీకా పొందినవారిలో బ్రేక్‌త్రూ కేసులు చాలా తక్కువగా ఉంటున్నట్టు వివరించారు.

ఇదీ చదవండి:వాతావరణ మార్పులే మరో కొత్త వేరియంట్​కు కారణమా?

ABOUT THE AUTHOR

...view details