తెలంగాణ

telangana

Nobel Prize 2023 In Medicine : కొవిడ్ టీకాల అభివృద్ధికి కృషి చేసిన వారికి నోబెల్

By PTI

Published : Oct 2, 2023, 3:34 PM IST

Updated : Oct 2, 2023, 4:12 PM IST

Nobel Prize 2023 In Medicine : వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ను ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్‌ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు గానూ వీరిద్దరికి ఈ అవార్డు లభించింది.

nobel prize 2023 in medicine
nobel prize 2023 in medicine

Nobel Prize 2023 In Medicine :వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు గానూ కాటలిన్‌ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ను ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్‌ పురస్కారం-2023 వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్‌ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ వీరికి ఈ అవార్డును ప్రకటించారు. ఈ మేరకు స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ కమిటీ సోమవారం వెల్లడించింది.

కాటలిన్​ కరికో హంగేరీలోని సాగన్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా, పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో అనుబంధ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. కరికో, వెయిస్‌మన్‌ కలిసి ఈ ప్రైజ్‌ విన్నింగ్‌ పరిశోధనను పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్లు ఆమోదం పొందడానికి వీరి పరిశోధన ఎంతగానో ఉపయోగపడింది. కొవిడ్‌-19ను ఎదుర్కొని కోట్లాది మంది ప్రాణాలను కాపాడటానికి ఈ ఎంఆర్‌ఎన్‌ఏ టీకాలు ఎంతగానో ఉపకరించాయి.

'కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధికి శాస్త్రవేత్తలు కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌ దోహదపడ్డారు.' అని నోబెల్ బృందం పేర్కొంది. వైద్య శాస్త్రంలో నోబెల్ విజేతలను థామస్ పెర్లమాన్​ ప్రకటించారు. విజేతలను ప్రకటించడానికి కొద్దిసేపటి ముందే వారిని కలిసి.. నోబెల్ బహుమతి వరించిందని చెప్పగా వారు ఆనందంతో పొంగిపోయారని అన్నారు.

వైద్య విభాగంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రకటనవారంపాటు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రం, బుధవారం రసాయనశాస్త్రం, గురువారం సాహిత్యం విభాగాల్లో గ్రహీతల పేర్లను ప్రకటిస్తారు. శుక్రవారం రోజున 2023 నోబెల్‌ శాంతి బహుమతి, అక్టోబర్‌ 9న అర్ధశాస్త్రంలో నోబెల్‌ పురస్కార గ్రహీతల పేర్లను వెల్లడిస్తారు. నోబెల్‌ పురస్కారాల గ్రహీతలకు ఇచ్చే నగదు బహుమతిని ఈ ఏడాది కాస్త పెంచారు. గతేడాది గ్రహీతలకు 10 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్ల నగదు అందజేయగా.. ఈసారి దాన్ని 11 మిలియన్ల స్వీడిష్‌ క్రోనర్లకు పెంచారు. స్వీడిష్‌ కరెన్సీ విలువ పడిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వహకులు ప్రకటించారు.

నోబెల్ పురస్కారాలను ఈ ఏడాది డిసెంబరు 10న గ్రహీతలకు అందజేయనున్నారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా.. 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు.

బ్యాంకులపై పరిశోధనలకు పురస్కారం.. ముగ్గురు నిపుణులకు ఆర్థికశాస్త్ర నోబెల్

మానవ హక్కుల పోరాట యోధులకు నోబెల్ శాంతి పురస్కారం

నోబెల్​ను ముద్దాడిన శాంతి దూతలు, శాస్త్ర స్రష్టలు

Last Updated :Oct 2, 2023, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details