తెలంగాణ

telangana

Colombia Serial Killer Dead : వీధివ్యాపారిగా నటిస్తూ 190 మంది చిన్నారుల హత్య.. ఆస్పత్రిలో సీరియల్ కిల్లర్​ మృతి

By ETV Bharat Telugu Team

Published : Oct 13, 2023, 10:07 AM IST

Colombia Serial Killer Dead : 190 మందికి పైగా పిల్లలను హత్య చేసిన కొలంబియా సీరియల్ కిల్లర్ ఆస్పత్రిలో మరణించాడు. అసలెవరా సీరియల్​ కిల్లర్​? ఏం జరిగింది?

Colombia Serial Killer Dead
Colombia Serial Killer Dead

Colombia Serial Killer Dead : 1990ల్లో 190 మందికిపైగా చిన్నారులను పొట్టనపెట్టుకున్న కొలంబియా​ సీరియల్​ కిల్లర్​ ఆస్పత్రిలో మరణించినట్లు జైలు అధికారులు వెల్లడించారు. ఉత్తర కొలంబియాలోని వల్లెడుపర్‌లోని ఆస్పత్రిలో చనిపోయినట్లు నేషనల్ పెనిటెన్షియరీ అండ్ ప్రిజన్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. అయితే అతడి మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

అసలు ఎవరీ కిల్లర్​?
Colombian Serial Killer Garavito : లూయిస్​ ఆల్ఫ్రెడో గారావిటో అలియాస్​ ది బీస్ట్​(66).. 1957లో కొలంబియన్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్విండియోలో జన్మించాడు. వీధి వ్యాపారిగా నటిస్తూ.. దిగువ మధ్య తరగతి కుటుంబాల పిల్లలను కిడ్నాప్​ చేసి అనేక మంది చిన్నారులను హత్య చేశాడు. 8-16 మధ్య వయసు గల చిన్నారులను పొట్టపెట్టుకున్నాడు. పెరీరా, అర్మేనియా, తుంజాలో మైనర్ల అదృశ్యాల కేసుల్లో గారావిటోపై అనుమానంతో అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

కోర్టులో నేరాన్ని ఒప్పుకున్న గారావిటో
చివరకు 1999 ఏప్రిల్​లో అత్యాచార యత్న ఆరోపణలతో గారావిటోను పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆ తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో 1994 నుంచి 59 కొలంబియా నగరాల్లో 114 చిన్నారుల మృతదేహాలు లభ్యమవ్వడాన్ని న్యాయమూర్తి ప్రస్తావించారు. 'ఆ చిన్నారుల హంతుకుడు నీవేనా?' అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఆ సమయంలో గారావిటో తాను చేసిన నేరాలను అంగీకరించాడు. తనను క్షమించమని వేడుకున్నాడు. 190 కంటే ఎక్కువ హత్యలు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదే సంవత్సరం గారావిటో కోర్టు విచారణలో బాధిత కుటుంబాలకు క్షమాపణలు చెప్పాడు గారావిటో. తాను చేసిన ప్రతీదానికీ క్షమాపణలు కోరుతున్నట్లు చెప్పాడు. చిన్నారులనే కాకుండా అనేక మందిని హత్య చేసినట్లు చెప్పాడు. అనంతరం కోర్టు అతడికి జైలు శిక్ష వేసింది.

The Beast Serial Killer Dead :అయితే అతడి శిక్షలో మూడో వంతు పూర్తయిన సందర్భంగా జైలు నుంచి గారావిటో విడుదల అవుతాడని వార్తలు వచ్చాయి. కానీ 2021లో అప్పటి ప్రెసిడెంట్​ ఇవాన్​ డ్యూక్​ అందుకు అంగీకరించలేదు. గారావిటో.. స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని ఇచ్చేందుకు ఆయన అంగీకరించలేదు. తన ప్రభుత్వ హయాంలో జైలులో ఉండాల్సిందే తీర్పునిచ్చారు. తాజాగా ఆస్పత్రిలో గారావిటో మరణించాడు.

డేటింగ్ యాప్​తో సీరియల్​ కిల్లర్​కు రివర్స్​ వల.. 160 ఏళ్లు శిక్ష పడేలా..

సీరియల్​ కిల్లర్​కు జీవితఖైదు.. 30 మంది చిన్నారులపై హత్యాచారం!

ABOUT THE AUTHOR

...view details