తెలంగాణ

telangana

బ్రిటన్ జెండాకు భారీ డిమాండ్​.. చైనాకు పోటెత్తిన ఆర్డర్లు

By

Published : Sep 18, 2022, 8:55 AM IST

Britain flag huge demand
బ్రిటన్ జాతీయ జెండా ()

Queen Elizabeth Funeral : బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌-2 కన్నుమూసిన తర్వాత ఆ దేశంలో జాతీయ జెండాలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. యూకేతోపాటు కామన్‌వెల్త్‌ రాజ్యాలైన ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాల్లోనూ జెండాలు భారీ సంఖ్యలో అమ్ముడుపోతున్నాయి. ఇందుకోసం ప్రపంచ కర్మాగారంగా పేరొందిన చైనాకు భారీగా ఆఫర్‌లు పోటెత్తాయి.

Queen Elizabeth Funeral : బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 మరణంతో బ్రిటన్‌ సహా కామన్‌వెల్త్‌ దేశాల్లో జాతీయ జెండాలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. రాణి ఎలిజబెత్‌ మరణించిన కొన్ని నిమిషాల్లోనే చైనాలోని షాంఘైలో తమ పరిశ్రమకు భారీ ఎత్తున జెండాలను తయారు చేయాలంటూ ఆర్డర్లు వచ్చాయని కంపెనీ మేనేజర్‌ ఫాన్‌ ఐపింగ్‌ వివరించారు. అదే రాత్రి జెండాలను ప్రింట్‌ చేయడం మొదలు పెట్టామని తెల్లారే సరికి అవి అమ్ముడయ్యాయని ఆమె వివరించారు.

రాణి మరణించిన తొలి రోజు నుంచి ఇప్పటి వరకు 5లక్షలకు పైగా యూకే జాతీయ జెండాలను తయారు చేసినట్లు ఐఫింగ్‌ వెల్లడించారు. వందకు పైగా కార్మికులు ఉన్న ఆ కార్మాగారంలో 9రోజుల నుంచి యూకే జెండాలను తయారు చేయడం తప్ప మరే పనులు చేయడం లేదని తెలిపిన ఆమె కంపెనీలోని కార్మికులకు తీరిక లేనంత పని దొరికిందన్నారు.

బ్రిటన్‌ రాణి మరణించి 9రోజులైనా.. ఇంకా ఆర్డర్ల వరద కొనసాగుతోందని షాంగ్‌డాంగ్‌ టూర్‌ ఆర్టికల్స్‌ కంపెనీ మేనేజర్‌ తెలిపారు. ముందుగా ఇచ్చిన ఆర్డర్లను పూర్తి చేయాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. కొద్ది రోజులుగా తయారు చేస్తున్న పతాకాలు పూర్తిగా ప్యాకింగ్‌ కూడా చేయకముందే వినియోగదారులు తీసుకుపోతున్నట్లు ఆమె వివరించారు. యూకే పతాకాలకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని కార్మాగారంలో పని వేళలను కూడా సవరించారు. కార్మికులు పని వేళలకు ఇబ్బంది పడకుండా పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు.

రాణి అంత్యక్రియలకు లండన్‌కు భారీ ఎత్తున ప్రజలు వెళ్లనున్నారు. ఇంగ్లాండ్‌తో పాటు ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలలోనూ తమ అధినేతకు నివాళి అర్పించనున్నారు. యూకేలోని భవంతులను ఆ పతాకాలతో అలంకరించనున్నారు. ప్రపంచంలో ఏ దేశాధినేతకు చేయనంత ఘనంగా బ్రిటన్‌ రాజవంశీయుల అంత్యక్రియలు చేస్తారు. ఇందుకోసం అనేక కామన్‌వెల్త్‌ దేశాల నుంచి ప్రజలు హాజరవుతారు. ఈ నేపథ్యంలో అక్కడ జెండాలకు భారీ డిమాండ్‌ ఏర్పడింది.

ఇవీ చదవండి:వరుణుడి బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం

వర్షాలు తగ్గినా వీడని వరదలు.. తీవ్రస్థాయిలో అంటువ్యాధులు.. పాక్ ప్రజలు విలవిల

ABOUT THE AUTHOR

...view details