తెలంగాణ

telangana

అమెరికాలో కరోనాతో ఒక్కరోజే 3 వేల మంది బలి

By

Published : Dec 3, 2020, 8:37 PM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రెండోసారి ఉద్ధృతంగా మారుతోంది. ఈ తరుణంలో రష్యాలో ఒకేరోజు 28 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు రష్యాలో 24 లక్షల మంది వైరస్​ బారిన పడగా 41వేల మంది మృతిచెందారు. అమెరికాలో ఒకేరోజు కరోనా కారణంగా.. లక్షమందికిపైగా ఆసుపత్రుల్లో చేరారు.

Russia Covid
రష్యాలో కొత్తగా 28 వేలమందికి వైరస్

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. రష్యాలో ఒకేరోజు రికార్డు స్థాయిలో 28,145 కొత్త కేసులు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రష్యాలో మొత్తంగా 24 లక్షల కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 41,607 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు. ఈ నేపథ్యంలో వ్యాపార కార్యకలాపాల దృష్ట్యా రెండోసారి లాక్​డౌన్​ విధించేందుకు అధికారులు వెనుకంజ వేస్తున్నారు. కానీ, కట్టుదిట్టమైన చర్యల విషయంలో రాష్ట్రాల వారీగా భిన్నమైన పరిమితులు ఉన్నాయి. కొవిడ్ వ్యాప్తిలో రష్యా నాలుగో స్థానంలో ఉంది.

ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది కొవిడ్​బారిన పడ్డారు. 1.5 కోట్ల మంది వైరస్​కు బలయ్యారు. మరోవైపు అమెరికాలో ఒకేరోజు లక్ష మందికి పైగా కరోనా కారణంగా ఆసుపత్రిలో చేరారు. 3,157 మంది వైరస్​ కారణంగా మృతిచెందారు.

కొత్త సంవత్సరమైనా తప్పదు

కరోనా దృష్ట్యా.. డిసెంబర్ 30 నుంచి జనవరి 3 వరకు రెస్టారెంట్లు, కేఫ్​లు, బార్లు పూర్తిగా మూసేయాలని అమెరికా ప్రభుత్వం ఆదేశించింది. డిసెంబర్​ 30 నుంచి జనవరి 10 వరకు కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మ్యూజియం, థియేటర్లు, ఎగ్జిబిషన్​ హాళ్లను తెరవకూడదని హెచ్చరించింది.

ప్రపంచ దేశాల్లో కొవిడ్ వ్యాప్తి ఇలా..

దేశం మొత్తం కేసులు మరణాలు
అమెరికా 14,314,265 2,79,867
భారత్ 9,538,757 1,38,712
బ్రెజిల్ 6,436,650 1,74,531
రష్యా 2,375,546 41,607
ఫ్రాన్స్ 2,244,635 53,816
స్పెయిన్ 1,682,533 45,784
బ్రిటన్ 1,659,256 59,699
ఇటలీ 1,641,610 57,045
అర్జెంటినా 1,440,103 39,156
కొలంబియా 1,334,089 37,117

ఇదీ చదవండి:టీకా పంపిణీకి ప్రపంచ దేశాలు సన్నద్ధం.. కానీ...

ABOUT THE AUTHOR

...view details