తెలంగాణ

telangana

'అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి'.. ఉక్రెయిన్​ సైన్యానికి పుతిన్‌ పిలుపు

By

Published : Feb 25, 2022, 10:41 PM IST

Russian President Vladimir Putin: ఉక్రెయిన్​ నాయకత్వాన్ని కూలదోయాలని ఆ దేశ సైన్యానికి పిలుపునిచ్చారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​. ఉక్రెయిన్​ అధికారులతో చర్చలకు సిద్ధమంటూనే ఈ మేరకు కీలక సూచనలు చేశారు.

Russian President Vladimir Putin
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​

Russian President Vladimir Putin: ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని ప్రకటించిన రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. మరో వైపు ఆదేశ సైన్యానికి కీలక సూచనలు చేశారు. ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని కూలదోయాలని పిలుపునిచ్చారు. అక్కడి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని సూచించారు. ఉక్రెయిన్‌ నాయకత్వాన్ని ఉగ్రవాదులు, డ్రగ్స్‌ ముఠాగా పేర్కొన్నారు. అక్కడి నాయకత్వాన్ని అభినవ నాజీలుగా అభివర్ణించారు. ఓ టీవీ ఛానల్‌ ద్వారా ఆయన మాట్లాడారు.

"ఉక్రెయిన్‌లోని మిలటరీ సిబ్బందికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. నయా నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయొద్దు. అధికారాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి"

- వ్లాదిమిర్​ పుతిన్​, రష్యా అధ్యక్షుడు.

ఇదీ చూడండి:Russia Ukraine war: రెండో రోజు భీకర పోరు.. చర్చల దిశగా అడుగులు!

ABOUT THE AUTHOR

...view details