తెలంగాణ

telangana

రెచ్చిపోయిన తాలిబన్లు- ఆత్మాహుతి దాడిలో జవాన్లు బలి

By

Published : Sep 5, 2021, 3:19 PM IST

Updated : Sep 5, 2021, 6:08 PM IST

ఉగ్రవాదులు మరో దుశ్చర్యకు ఒడిగట్టారు. తెహ్రీక్​ ఏ తాలిబన్​ పాకిస్థాన్​ ముఠాకు చెందిన ఉగ్రవాది(suicide bomber).. భద్రతా బలగాలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి(suicide attack in pakistan) పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు.. ఇరాక్​లోని కిర్​కుక్​ ప్రాంతంలో జరిగిన ఉగ్ర దాడిలో 13 మంది పోలీసులు మరణించారు.

Taliban suicide bomber blows himself
తాలిబన్ల ఆత్మాహుతి దాడి

పాకిస్థాన్​లోని బలూచిస్థాన్​ రాష్ట్రంలో తెహ్రీక్​ ఏ తాలిబన్ పాకిస్థాన్​(టీటీపీ) ఉగ్రముఠాకు చెందిన సభ్యుడు (suicide bomber) ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు(suicide attack in pakistan). ఈ ఘటనలో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్ర రాజధాని క్వెట్టా నగరంలోని మస్టుంగ్​ రోడ్​ చెక్​పాయింట్​లోని భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు.. నగర డీఐజీ అజార్​ అక్రమ్​ తెలిపారు. ఆ బలగాలు రాష్ట్రంలోని ఉగ్రవాద నిర్మూలన కోసం పని చేస్తున్నట్లు చెప్పారు. గాయపడిన 20 మందిలో 18 మంది భద్రతా సిబ్బంది కాగా.. ఇద్దరు స్థానికులుగా తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం

ఈ దాడి చేసింది తామేనని తెహ్రీక్​ ఏ తాలిబన్​ పాకిస్థాన్​ (టీటీపీ) ప్రకటించింది. కాబుల్​లో తాలిబన్(Afghanistan Taliban)​ ప్రభుత్వం వచ్చిన క్రమంలో టీటీపీని అదుపు చేయొచ్చనే పాకిస్థాన్​ ఆలోచన సరైంది కాదనే సంకేతాలను పంపేందుకే ఈ దాడికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు.

దాడిలో పూర్తిగా ధ్వంసమైన ద్విచక్రవాహనం

ఖండించిన ప్రధాని..

భద్రతా బలగాలపై ఆత్మాహుతి(Suicide attack) దాడిని తీవ్రంగా ఖండించారు ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​. దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. విదేశీ మద్దతుతో చెలరేగుతున్న ఉగ్రవాదుల నుంచి తమ దేశాన్ని కాపాడినందుకు వీర జవాన్లకు సెల్యూట్​ చేస్తున్నానన్నారు.

ఇరాక్​లో 13 మంది మృతి..

ఉత్తర ఇరాక్​లోని కిర్​కుక్​ ప్రాంతానికి సమీపంలో ఉన్న చెక్​పాయింట్​పై ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 13 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికి మీడియా తెలిపింది. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సటిహా గ్రామంలోని చెక్​పాయింట్​పై కొందరు సాయుధులు కాల్పులకు పాల్పడ్డారని ఓ అధికారి తెలిపారు. సుమారు ఒక గంట పాటు ఎదురుకాల్పులు జరిగాయని చెప్పారు.

ఇదీ చూడండి:సంబరాల పేరుతో 17 మందిని కాల్చి చంపిన తాలిబన్లు

Last Updated : Sep 5, 2021, 6:08 PM IST

ABOUT THE AUTHOR

...view details