తెలంగాణ

telangana

సెక్స్​ వర్కర్లను ఉరితీసేందుకు తాలిబన్ల ప్రణాళిక!

By

Published : Sep 4, 2021, 3:03 PM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు అరాచక పాలనకు తెరతీశారా? మహిళలకు వారి రాజ్యంలో భద్రత లేదా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. దేశంలో వేశ్య వృత్తిలో ఉన్నవారిని బహిరంగంగా ఉరితీసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని సమాచారం. ఈ మేరకు వారిని గుర్తించేందుకు పోర్న్ వెబ్​సైట్లను జల్లెడపడుతున్నారని తెలుస్తోంది.

Taliban
తాలిబన్లు

దేశవ్యాప్తంగా మహిళల భద్రతకు హామీ ఇచ్చిన తాలిబన్లు.. వారికి నచ్చనివారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదనే సంకేతాలిస్తున్నారు. మహిళల హక్కులను కాలరాసైనా సరే కఠినమైన షరియా చట్టాలను అమలు చేయడానికి సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో అఫ్గాన్​వ్యాప్తంగా ఉన్న సెక్స్ వర్కర్ల జాబితాను సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వారి చట్టాల ప్రకారం సెక్స్ వర్కర్లకు మరణశిక్ష విధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అంతేగాకుండా వారికి నచ్చిన వారిని సెక్స్ బానిసలుగానూ వాడుకునే ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

పోర్న్​ సైట్లు చూసి మరీ..!

సెక్స్ వర్కర్లను గుర్తించేందుకు గాను పోర్న్ వెబ్‌సైట్స్ ద్వారా తాలిబన్లు జాబితా సిద్ధం చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. విదేశీయులతో శృంగారంలో పాల్గొన్న మహిళలను గుర్తించి మరణశిక్ష విధించే ఆలోచనలో తాలిబన్లు ఉన్నట్లు 'ది సన్' అనే పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

1996-2001 మధ్య అధికారంలో ఉన్న తాలిబన్లు.. సెక్స్ వర్కర్లకు బహిరంగ మరణశిక్ష అమలు చేశారు. అప్పట్లో ఇది సంచలనంగా మారింది. తాలిబన్ల పాలనలో సెక్క్ వర్కర్ల ప్రాణాలకు తీవ్ర ముప్పు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా ఇప్పటికే ఆందోళన వ్యక్తంచేసింది.

అఫ్గానిస్థాన్‌లో వేశ్యవృత్తి చట్టవిరుద్ధం. దేశ శిక్షాస్మృతిలో శిక్షల జాబితాను పేర్కొనకపోయినప్పటికీ.. పట్టుబడితే జైలుకు వెళ్లే ప్రమాదం ఉంది. అఫ్గాన్​వ్యాప్తంగా దేశ రాజధాని కాబుల్‌లో వందల మంది సెక్స్ వర్కర్లు ఉన్నట్లు జూన్‌లో మానవ హక్కుల సంస్థలు నివేదించాయి.

ఇవీ చదవండి:Afghan Crisis: పంజ్​షేర్ తాలిబన్ల వశమైందా?

ABOUT THE AUTHOR

...view details