తెలంగాణ

telangana

అమెరికా ఆయుధాలతో తాలిబన్ల బల ప్రదర్శన

By

Published : Nov 15, 2021, 2:12 PM IST

అఫ్గాన్​లో అధికారం చేపట్టిన తాలిబన్లు.. అమెరికా, ఇతరదేశాల దళాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలతో ఆదివారం బల ప్రదర్శన(Taliban military parade) నిర్వహించారు. తాలిబన్‌ దళాల్లో 250 మంది సైనికులు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ కవాతు నిర్వహించారు.

taliban military parade
తాలిబన్ల బలప్రదర్శన

అమెరికా, ఇతరదేశాల దళాలు వదిలేసి వెళ్లిన ఆయుధాలతో తాలిబన్లు(Afghan taliban news) ఆదివారం బల ప్రదర్శన(Taliban military parade) నిర్వహించారు. వీటిల్లో అమెరికా సాయుధ వాహనాలు, రష్యా హెలికాప్టర్లు ఉన్నాయి. ఆగస్టులో పౌర ప్రభుత్వం కుప్పకూలి.. తాలిబన్లు అధికారంలోకి రావడం వల్ల వారు ఈ ఆయుధాలను(Taliban military power 2021) స్వాధీనం చేసుకొన్నారు. తాలిబన్‌ దళాల్లో 250 మంది సైనికులు కొత్తగా శిక్షణ పూర్తి చేసుకొన్న సందర్భంగా ఈ కవాతు(Taliban military parade) నిర్వహించారు.

ఈ కవాతులో అమెరికా తయారు చేసిన ఎం117 సాయుధ వాహనాలు, ఎం-17 హెలికాప్టర్లు, అమెరికాలో తయారైన ఎం4 అసాల్ట్‌ తుపాకులు వంటి వాటిని ప్రదర్శించారు. అఫ్గాన్‌ జాతీయ దళాల్లో పనిచేసిన పైలట్లు, మెకానిక్‌లను తాజాగా తమ బలగాల్లో చేర్చుకొంటున్నట్ల తాలిబన్‌ ప్రతినిధి వెల్లడించారు. తాలిబన్లు(Afghan taliban news) ఇటీవల మిలటరీ దుస్తులను వాడటం మొదలు పెట్టారు. గతంలో తాలిబన్‌ ఫైటర్లు కేవలం సంప్రదాయ దుస్తుల్లో మాత్రమే కనిపించేవారు.

మధ్యవర్తిగా తాలిబన్లు..!

ఇటీవల పాక్‌ ప్రభుత్వానికి, ఉగ్ర సంస్థ తెహ్రీక్‌ ఈ తాలిబన్‌ పాకిస్థాన్‌ ఉగ్ర సంస్థకు మధ్య అఫ్గాన్‌ తాలిబన్లు మధ్యవర్తిత్వం వహించారు. ఈ విషయాన్ని అఫ్గాన్‌ విదేశాంగ మంత్రి అమిర్‌ కాన్‌ ముత్తాఖీ స్వయంగా తెలిపారు. పాక్‌కు చెందిన జియో టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తమ పాలసీలో భాగంగా ఈ పనిచేసినట్లు ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఈ చర్చల ఫలాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ చర్చలు అఫ్గానిస్థాన్‌ ఇంటీరియర్‌ మినిస్టర్‌ సిరాజుద్దీన్‌ హక్కానీ ఆధ్వర్యంలో దాదాపు రెండు వారాలపాటు జరిగాయి.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details