ETV Bharat / international

'పాకిస్థాన్​కు అమెరికా ఆయుధాలా? అంతా తూచ్​!'​

author img

By

Published : Nov 13, 2021, 10:18 AM IST

Taliban
తాలిబన్​

అఫ్గానిస్థాన్​లోని అమెరికా ఆయుధాలను(america weapons in afghanistan) పాకిస్థాన్​కు విక్రయిస్తున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చారు తాలిబన్లు(Afghanistan Taliban). అలాంటి వార్తల్లో నిజం లేదని, ప్రస్తుతం అఫ్గాన్​లో స్వతంత్ర ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. తమ భద్రతా విభాగాలకే ఆయుధాలు అవసరమని తెలిపారు.

అఫ్గానిస్థాన్​లో బలగాల ఉపసంహరణ నేపథ్యంలో అమెరికా వదిలేసిన ఆయుధాలను(america weapons in afghanistan) పాకిస్థాన్​కు విక్రయిస్తున్నారన్న వార్తలను ఖండించారు తాలిబన్లు(Afghanistan Taliban). అందులో నిజం లేదని ఇస్లామిక్​ ఎమిరేట్​ ప్రతినిధి ఇనాముల్లా సమంఘాని తోసిపుచ్చినట్లు టోలో న్యూస్​ తెలిపింది.

" ఆ వార్తలను ఇస్లామిక్​ ఎమిరేట్​ ఖండిస్తోంది. ఇప్పుడు అఫ్గానిస్థాన్​లో స్వతంత్ర ప్రభుత్వం ఉంది. ప్రత్యేక రక్షణ విభాగాలను కలిగి ఉంది. ఆ భద్రతా విభాగాలకు మిలిటరీ సామగ్రి అవసరం ఉంటుంది."

- ఇనాముల్లా సమంఘాని, అఫ్గానిస్థాన్​ ప్రతినిధి.

అఫ్గానిస్థాన్​లో అమెరికా బలగాలు వదిలేసిన ఆయుధాలను(america weapons in afghanistan) కొనుగోలు చేసేందుకు పాకిస్థాన్​ ప్రయత్నిస్తోందని, ఇప్పటికే చాలా వరకు చేజిక్కించుకుందని పలు నివేదికలు వెల్లడించాయి. ఆ ఆయుధాలను ఉగ్ర ముఠాలకు అందించే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే స్పందించారు తాలిబన్లు(Taliban news).

ఈ ఏడాది ఆగస్టులో అఫ్గాన్​ నుంచి ఆగమేఘాలపై బలగాలను వెనక్కి రప్పించింది అమెరికా. ఈ క్రమంలోనే సుమారు 85 బిలియన్​ డాలర్ల విలువైన ఆయుధాలను(america weapons in afghanistan) వదిలేసినట్లు టోలో న్యూస్​ పేర్కొంది.

అమెరికా ఆయుధాలను భారత్​లో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్​ఐ కనుసన్నల్లోని ఉగ్రవాద సంస్థలకు అప్పగించే ప్రమాదం ఉందని న్యూయార్క్​ టైమ్స్​ రెండు రోజుల క్రితం పేర్కొంది. అయితే.. తాలిబన్ల విజయంతో పాక్​లోని ఉగ్రముఠాలు ధైర్యంగా తయారయ్యాయని, ఆ ఆయుధాలను ఆ దేశంలోనే తొలుత వినియోగిస్తారని భారత్​ పేర్కొంది. ఎలాంటి ప్రమాదం ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: పాక్​ చేతికి అఫ్గాన్​లోని అమెరికా ఆయుధాలు- భారత్​లో విధ్వంసానికేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.