తెలంగాణ

telangana

'హెలికాప్టర్​కు శవాన్ని వేలాడదీసిన తాలిబన్లు'- నిజమెంత?

By

Published : Sep 1, 2021, 9:18 AM IST

Updated : Sep 1, 2021, 10:11 AM IST

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లు(Afghanistan Taliban) ఓ శవాన్ని హెలికాప్టర్‌కు వేలాడదీశారని వార్తలొచ్చాయి. ఇందుకు సబంధించిన వీడియోను ఆధారంగా చూపుతూ రిపబ్లికన్లు బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే ఆ వీడియోలో వేలాడేది శవం కాదని, బతికున్న వ్యక్తే సాహసం చేశాడని ఓ యువకుడు ట్వీట్ చేశాడు.

taliban-fly-american-chopper-with-body-hanging-from-rope
శవాన్ని వేలాడదీస్తూ హెలికాప్టర్​లో తాలిబన్ల చక్కర్లు!

అఫ్గాన్‌ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు(Afghanistan Taliban) తమ దురాగతాల పరంపరను కొనసాగిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని ఊచకోత కోస్తున్నారు. 20 ఏళ్ల సుదీర్ఘ యుద్ధాన్ని ముగించుకుని అఫ్గాన్‌ నుంచి అమెరికా సైన్యం వెనుదిరగగానే కాబుల్‌ విమానాశ్రయాన్ని ఆక్రమించుకున్నారు. అదే క్రమంలో.. ఓ వ్యక్తి శవాన్ని హెలికాప్టర్‌కు కట్టి వారు కాందహార్‌లో విహరించారనే ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

అఫ్గాన్‌ను(Afghan Crisis) విడిచి వెళ్లే క్రమంలో కొన్ని ఆయుధాలను అమెరికా సైన్యం అక్కడే వదిలేసి వెళ్లింది. కాగా అగ్రరాజ్యానికి చెందిన ఓ హెలికాప్టర్‌లో తాలిబన్లు కాందహార్‌లో విహరించారు. అయితే ఆ హెలికాప్టర్‌కు ఓ వ్యక్తిని తాడుతో వేలాడదీశారు. అది గాల్లో ఎగురుతుండగా.. దాని కింద తాడుకు ఓ వ్యక్తి వేలాడటాన్ని పలువురు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అది వ్యక్తి మృతదేహమేనని, అతడిని చంపిన తర్వాతే తాలిబన్లు ఇలా చేశారని అక్కడి పలు మీడియా సంస్థలు వార్తలు ప్రచారం చేశాయి. దీన్నే ఆధారంగా చూపుతూ రిపబ్లికన్లు భైడెన్ ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. అమెరికా బలగాలు వెళ్లిపోవడం వల్లే తాలిబన్లు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు.

అయితే వీడియోలో వేలాడేది శవం కాదని, అతను బతికున్నట్లు స్పష్టంగా కన్పిస్తోందని ఓ యువకుడు ఫొటో షేర్ చేశాడు. హెలికాప్టర్​ నుంచి వేలాడుతున్న వ్యక్తి కవచం ధరించడమే కాక, తాడును చేతితో పట్టుకున్నట్లు పేర్కొన్నాడు. అది సాహసంలా కన్పిస్తోందన్నాడు. ఈ వీడియోలో కొంతభాగాన్ని మాత్రమే పరిశీలించి కొందరు అవాస్తవాన్ని చెబుతున్నారని చెప్పాడు.

తాడును పట్టుకున్న వ్యక్తి

అమెరికాకు చెందిన పలు ఆయుధాలు అఫ్గాన్‌లోనే ఉండిపోయాయి. సోమవారం అర్ధరాత్రే అగ్రరాజ్యం దళాలు హడావుడిగా నిష్క్రమించాయి. తాము వెళ్లేముందే ఇక్కడున్న అన్ని ఆయుధాలను నిర్వీర్యం చేశామని దళాలు పేర్కొన్నప్పటికీ.. అది సాధ్యం కాలేదని స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. అమెరికా వాహనాలు, హెలికాప్టర్లలో తాలిబన్లు విహరించడం ఆ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.

ఇదీ చదవండి:పారిపోతున్న 'గే'పై తాలిబన్ల క్రూరత్వం- రేప్​ చేసి మరీ...

Last Updated :Sep 1, 2021, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details