తెలంగాణ

telangana

'ఐక్యంగా ఉంటేనే సాగర భద్రత సాధ్యం'

By

Published : Aug 10, 2021, 7:09 AM IST

ప్రపంచ దేశాలు ఏకమైతేనే సముద్ర భద్రత సాధ్యమవుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఐరాస భద్రతా మండలిలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన వీడియో కాన్ఫరెన్స్​లో ఈ విధంగా మాట్లాడారు.

putin, russia president
పుతిన్, రష్యా అధ్యక్షుడు

అంతర్జాతీయ సంస్థలు, ప్రపంచ దేశాల పరస్వర సహకారంతోనే సాగర భద్రత సాధ్యమవుతుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC)లో సోమవారం వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు.

అంతర్జాతీయ చట్టాలను రష్యా నిబద్ధతతో పాటిస్తుందని పుతిన్ తెలిపారు. అంతర్గత వ్యవహారాలు, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం, సార్వభౌమాధికారం మొదలైన అంశాలను గౌరవిస్తుందని పేర్కొన్నారు.

సముద్ర మార్గాలను పటిష్టం చేసేందుకు రష్యా కృషి చేస్తోందని పుతిన్ వ్యాఖ్యానించారు. సముద్ర మార్గంలో ఉగ్రవాదం, దోపిడీని అరికట్టేందుకు చేపట్టిన చర్యలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. యూఎన్​ఎస్​సీ బహిరంగ చర్చకు భారత్​ పిలుపునివ్వడం సంతోషంగా ఉందని అన్నారు.

'సముద్ర భద్రత పెంపు - అంతర్జాతీయ సహకార ఆవశ్యకత' అనే అంశంపై ఐరాస భద్రత మండలి (యూఎన్‌ఎస్‌సీ)లో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన ఉన్నత స్థాయి బహిరంగ చర్చకు మోదీ అధ్యక్షత వహించారు. మహాసముద్రాలను యావత్‌ ప్రపంచ వారసత్వ సంపదగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. సాగర భద్రత విషయంలో దేశాల మధ్య పరస్పర సహకారం పెరగాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఇందుకోసం ఐదు సూత్రాలను ప్రతిపాదించారు.

ఇదీ చదవండి:'బైడెన్‌ బలహీనుడు కాదు.. చాలా తెలివైన వ్యక్తి'

ABOUT THE AUTHOR

...view details