ETV Bharat / international

'బైడెన్‌ బలహీనుడు కాదు.. చాలా తెలివైన వ్యక్తి'

author img

By

Published : Jun 18, 2021, 5:41 AM IST

Updated : Jun 18, 2021, 6:44 AM IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో చర్చించడం అంత సులభం కాదని తెలిపారు రష్యా అధ్యక్షుడు పుతిన్. ఆయన ఎంతో తెలివైనవారని కొనియాడారు.

Putin calls Biden a tough negotiator
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అనుభవజ్ఞుడైన నాయకుడని జెనీవా శిఖరాగ్ర సదస్సులో చెప్పిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌.. గురువారం మాస్కోలో అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. బైడెన్‌తో చర్చించడం అంత సులభం కాదని అన్నారు.

ప్రతీ విషయంపైనా బైడెన్​కు అవగాహన ఉందని పుతిన్ పేర్కొన్నారు. "తాను సాధించాల్సిందేంటో బైడెన్‌కు బాగా తెలుసు. ఆ పనిని ఆయన చాలా తెలివిగా చేస్తారు" అని పుతిన్‌ పొగిడారు.

చైనాతో డేంజర్​..

అమెరికా-రష్యాల మధ్య సంబంధాలు ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి స్ధాయికి క్షీణించాయని అంతా భావిస్తున్న వేళ.. ఇటీవల స్విట్జర్లాండ్​లోని జెనీవాలో భేటీ అయిన ఈ ఇరువురు దేశాధినేతలు పలు అంశాలపై చర్చించారు.

పొరుగున ఉన్న చైనాతో అప్రమత్తంగా ఉండాలని బైడెన్‌.. వ్లాదిమిర్‌ పుతిన్‌ను హెచ్చరించారు. ఈ సందర్భంగా చైనా విషయంలో పుతిన్‌కు జాగ్రత్తలు సూచించిన బైడెన్.. సరిహద్దుల్లోని ఆ దేశం దూకుడును గమనించాలని అప్రమత్తం చేశారు.

రష్యాలో మానవ హక్కుల ఉల్లంఘనను, ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నావల్నీని నిర్బంధించిన విషయాన్ని పుతిన్​తో సమావేశంలో తాను ప్రస్తావించానని బైడెన్ తెలిపారు. "అమెరికా అధ్యక్షుడిగా మానవ హక్కుల గురించి ఎలా మాట్లాడకుండా ఉంటాను. అలెక్సీ నావల్నీ లాంటి అంశాలు అమెరికా ఎప్పటికీ లేవనెత్తుతూనే ఉంటుంది" అని బైడెన్ చెప్పారు.

ఇదీ చూడండి: 'సరిహద్దుల్లో చైనా దూకుడు.. కాస్త జాగ్రత్త'

Last Updated : Jun 18, 2021, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.