తెలంగాణ

telangana

ముంబయి దాడుల సూత్రధారి లఖ్వీ అరెస్టు

By

Published : Jan 2, 2021, 3:46 PM IST

లష్కరే తొయిబా కమాండర్ జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ అరెస్టయ్యాడు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో లఖ్వీని పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్​మెంట్ అదుపులోకి తీసుకుంది.

lakhvi arrest
ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి లఖ్వీ అరెస్టు

ముంబయి దాడుల సూత్రధారి, లష్కరే తొయిబా ఆపరేషన్స్ కమాండర్ జకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీని పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు నిధులు అందజేస్తున్నారన్న ఆరోపణలతో లఖ్వీని అదుపులోకి తీసుకున్నారు.

2015 నుంచి లఖ్వీ బెయిల్​పై ఉన్నారు. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం పంజాబ్ రాష్ట్రానికి చెందిన కౌంటర్ టెర్రరిజం డిపార్ట్​మెంట్(సీటీడీ) లఖ్వీని అరెస్టు చేసిందని అధికారులు తెలిపారు. అయితే ఏ ప్రదేశంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న విషయం వెల్లడించలేదు.

"ఉగ్రవాద నిధులను ఉపయోగించి లఖ్వీ డిస్పెన్సరీ(చికిత్స కేంద్రం)ని నడిపేవారు. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు ఆ డిస్పెన్సరీ ద్వారా నిధులు సమీకరించేవారు. వ్యక్తిగత ఖర్చులకు కూడా ఈ నిధులను ఉపయోగించుకునేవారు."

-సీటీడీ ప్రకటన

లఖ్వీ కేసును లాహోర్​లోని ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం విచారించనుందని సీటీడీ స్పష్టం చేసింది. లష్కరేతో సంబంధాలే కాకుండా.. ఐరాస ఉగ్రవాదుల జాబితాలో లఖ్వీ పేరు ఉందని పేర్కొంది.

ఇదీ చదవండి:రిపబ్లిక్ డే రోజున '‌కిసాన్‌ పరేడ్'‌

ABOUT THE AUTHOR

...view details