తెలంగాణ

telangana

ఎన్నికల్లో రాజపక్స జయభేరి- 145 సీట్లు కైవసం

By

Published : Aug 7, 2020, 7:59 AM IST

శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార రాజపక్స సోదరుల పార్టీ విజయదుందుభి మోగించింది. మొత్తం 225 స్థానాలకు గాను 145 చోట్ల విజయం సాధించింది.

LANKA-POLL-RESULTS
రాజపక్స ఘన విజయం

శ్రీలంక పార్లమెంటరీ ఎన్నికల్లో గొటబాయ రాజపక్స పార్టీ 'శ్రీలంక పీపుల్స్ ఫ్రంట్' ఘన విజయం సాధించింది. మూడింట రెండొంతుల మెజారిటీతో విజయఢంకా మోగించారు రాజపక్స సోదరులు. మొత్తం 225 స్థానాలకు గాను 145 సీట్లను కైవసం చేసుకున్నారు.

గతేడాది నవంబర్​లో గొటబాయ రాజపక్స అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి మహిందా రాజపక్స ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ గెలుపు అధికార పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకమని రాజపక్స సోదరులు వ్యాఖ్యానించారు. అంతకుముందు భారత ప్రధాని నరేంద్రమోదీ తమకు ఫోన్​ ద్వారా శుభాకాంక్షలు తెలిపారని మహిందా ట్వీట్ చేశారు.

71 శాతం పోలింగ్..

కరోనా మహమ్మారి భయాల నేపథ్యంలో బుధవారం జరిగిన పోలింగ్ శాంతియుతంగా ముగిసింది. మొత్తం 71 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తొలుత ఏప్రిల్​లోనే ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. కరోనా నేపథ్యంలో రెండు సార్లు వాయిదా పడ్డాయి.

ఇదీ చూడండి:రాజకీయ సంక్షోభం పరిష్కారం దిశగా 'ప్రచండ' చర్చలు

ABOUT THE AUTHOR

...view details