ETV Bharat / international

రాజకీయ సంక్షోభం పరిష్కారం దిశగా 'ప్రచండ' చర్చలు

author img

By

Published : Aug 6, 2020, 9:27 PM IST

నేపాల్​లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ప్రధాని కేపీ శర్మ ఓలితో విబేధాలు పరిష్కరించేందుకు కమ్యూనిస్ట్​ పార్టీ ఛైర్మన్​ పుష్ప కమల్​ దహల్​ ప్రచండ ప్రయత్నాలు చేపట్టారు. ఈ మేరకు ప్రధాని సన్నిహితుడు, మాజీ స్పీకర్​ నెం​బాంగ్​తో భేటీ అయ్యారు.

Prachanda meets former Speaker to resolve intra-party rift
రాజకీయ సంక్షోభం పరిష్కారం దిశగా 'ప్రచండ' చర్చలు

నేపాల్​ కమ్యూనిస్ట్​ పార్టీ (ఎన్​సీపీ)లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆ పార్టీ ఎగ్జిక్యూటివ్​ ఛైర్మన్​ పుష్ప కమల్​ దహల్ (ప్రచండ) ప్రయత్నాలు చేపట్టారు. ఈ మేరకు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలికి అత్యంత సన్నిహితుడు, మాజీ స్పీకర్​ సుభాష్​ నెం​బాంగ్​తో సమావేశమయ్యారు ప్రచండ. పార్టీలో నెలకొన్న అంతర్గత కలహాల పరిష్కారంపై చర్చించారు.

ప్రధాని కేపీ శర్మ ఓలీ, ప్రచండల మధ్య గురువారం జరగాల్సిన భేటీ కార్యరూపం దాల్చలేదు. అయితే.. ఇందులో భాగంగానే ప్రధాని తరఫున నెం​బాంగ్..​ పార్టీ ఛైర్మన్​ ప్రచండతో సమావేశమైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ స్పీకర్​​.. సమావేశం సానుకూలంగా సాగిందన్నారు. కానీ ఎలాంటి కీలక విషయాలు వెల్లడించలేదు

"ప్రచండతో భేటీ సానుకూలంగా సాగింది. చీలికలు ఏర్పడకుండా పార్టీని కాపాడేందుకు ఇరువురు అగ్రనేతల మధ్య అవగాహన ఏర్పరిచేందుకు మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది."

- నెం​బాంగ్​, నేపాల్​ మాజీ స్పీకర్​

10 సార్లు...

ఇరువురి మధ్య ఏర్పడిన విబేధాలను తొలగించేందుకు ఇటీవల సుమారు 10 సార్లు భేటీ అయ్యారు ఓలి, ప్రచండ. కానీ, ఒక వ్యక్తి, ఒకే పోస్టు అనే షరతును ప్రధాని అంగీకరించకపోవటం వల్ల చర్చలు విఫలమయ్యాయి. ప్రధాని పదవితో పాటు ఎన్​సీపీ కో ఛైర్మన్​ పదవిని వదులుకునేందుకు ఓలీ ఒప్పుకోవటం లేదు.

ఇదీ చూడండి: ఓలి-ప్రచండ మధ్య రాజీకి ఎన్​సీపీ విఫలయత్నం

నేపాల్​ అధికార పార్టీలో చీలిక తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.