తెలంగాణ

telangana

తైవాన్ ఆక్రమణకు చైనా సన్నాహాలు?

By

Published : Oct 19, 2020, 8:01 AM IST

తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు ఆక్రమణలకు యత్నిస్తూ భారత్‌తో కయ్యానికి దిగిన చైనా, తైవాన్‌పై కూడా దురాక్రమణ ప్రయత్నాలు ఆరంభించింది. దీని కోసం చైనా ఆగ్నేయ తీరంలో తమ సైనిక బలగాల సంఖ్యను క్రమంగా పెంచుతోంది.

CHINA-THAIWAN-war-issue
తైవాన్ ఆక్రమణకు చైనా సన్నాహాలు ?

తైవాన్​ను చేజిక్కించుకునేందుకు చైనా పావులు కదుపుతోంది. దీనికోసం తమ దేశ ఆగ్నేయ తీరంలో తమ సైనిక బలగాల సంఖ్యను క్రమంగా పెంచుతోంది. ఈ ప్రాంతంలో పాత డీఎఫ్​-11, డీఎఫ్​-15 క్షిపణులను తొలగించి అత్యాధునిక హైపర్‌ సొనిక్‌ క్షిపణి డీఎఫ్​-17ను మోహరిస్తోంది.

ఉపగ్రహ చిత్రాల ఆధారంగా :

ఆగ్నేయ ప్రాంతంలోని ఫుజియాన్‌ సహా గువాంగ్‌డాంగ్‌లోని మెదిన్‌ కోర్‌ ప్రాంతాల్లో రాకెట్‌ ఫోర్స్‌ బలగాలను చైనా భారీగా పెంచినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా వెల్లడైంది. ఇది తైవాన్‌ ఆక్రమణ కోసమే అని విశ్లేషకుల అంచనా. ఈ నెల 13న గువాంగ్‌డాంగ్‌ ప్రాంతాన్ని సందర్శించిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ యుద్ధ సన్నద్ధత కోసం సర్వశక్తులు ఒడ్డాలని తమ సైన్యానికి పిలుపునిచ్చారు.

అమెరికా సూచన :

తైవాన్‌ను చేజిక్కించుకునేందుకు సైనిక చర్య అవకాశాలను కొట్టిపారేయలేమని కూడా జిన్​పింగ్​ గతంలో వ్యాఖ్యానించారు. అటు చైనా ప్రయత్నాలను ధ్రువీకరించిన అగ్రరాజ్యం అమెరికా.. దురాక్రమణకు యత్నిస్తే తిప్పికొట్టాలని తైవాన్‌కు సూచించింది. చైనా తన సైన్యాన్ని ముందుకు కదిలించే ముందు తమ వైఖరిని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రయాన్‌ సూచించారు. అమెరికా జోక్యం చేసుకుంటే చైనా పరిస్ధితి ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details