తెలంగాణ

telangana

మంచు తుపానుతో కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

By

Published : Jan 27, 2021, 10:26 AM IST

అమెరికాలోని పలు రాష్ట్రాల్లో మంచు తుపానుతో జనజీవనం స్తంభించింది. రహదారులపై పేరుకుపోయిన మంచుతో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. కొలరాడోలో పలు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి.

cailfornia, america, us
అమెరికాలో మంచు తుపానుకి స్తంభించిన రహదారులు

మంచు తుపాను కారణంగా అమెరికాలోని పలు రాష్ట్రాలో వాహన రాకపోకలు స్తంభించాయి. లాస్​ఏంజెలస్​, సాన్​ జాక్విన్​ లోయ మధ్య ఉన్న టెంజాన్​ పాస్​ వద్ద ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. దీంతో కాలిఫోర్నియా పోలీసులు ఆ మార్గంలో అంతరాష్ట్ర రవాణాను సోమవారం తాత్కాలికంగా నిలిపివేశారు. ఇదే పరిస్థితి రాష్ట్ర రహదారి 58 వద్ద నెలకొంది. తూర్పు కెర్న్​ కౌంటీలోని తెహఛాపీ పాస్​ వద్ద మంచు తీవ్రత ఎక్కువ ఉండటమే కారణం. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎస్​ఆర్​178 మార్గం అందుబాటులో ఉన్నా వాహనాలకు గొలుసులు ఉన్న ప్రత్యేక టైర్లను ఉపయోగించాల్సి వస్తోంది.

మంచు తుపాను ధాటికి స్తంభించిన కాలిఫోర్నియా

వారం క్రితం ప్రారంభమైన మంచు తుపాను కాలిఫోర్నియా సహా ఇతర రాష్ట్రాల్లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మంగళవారం నుంచి ఈ తుపాను మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గురువారం వరకు ఈ ప్రభావం ఉండొచ్చని అంచనా వేసింది. శాన్​ఫ్రాన్సిస్​కో బేలోని ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరించింది. ప్రభుత్వం అందుకు తగిన చర్యలు చేపడుతోంది.

కొలరాడోలో రొడ్డు ప్రమాదం.. చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బంది

కొలరాడోలో ప్రమాదాలు..

కొలరాడోలోని అంతర్రాష్ట్ర రహదారి 25పై మంచు తుపాను కారణంగా మంగళవారం రోడ్డు ప్రమాదాలు జరిగాయి. లవ్​ల్యాండ్​ ప్రాంతంలో సుమారు 17 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదాల్లో ఆరుగురు గాయపడ్డారని తెలిపారు.

ఇదీ చదవండి :సెనేట్​ ముందుకు ట్రంప్​ అభిశంసన

ABOUT THE AUTHOR

...view details