తెలంగాణ

telangana

పారాగ్లైడర్​ను ఢీకొని కూలిన విమానం.. ఇద్దరు మృతి

By

Published : Dec 22, 2021, 8:21 AM IST

Updated : Dec 22, 2021, 12:00 PM IST

Plane hits Paraglider: పారాగ్లైడర్​ను ఢీకొని తేలికపాటి విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన అమెరికాలోని హ్యూస్టన్​ జరిగింది.

Plane crash
Plane crash

Plane hits Paraglider: అమెరికా హ్యూస్టన్​లో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఓ తేలికపాటి విమానం.. పారాగ్లైడర్​ను ఢీకొని నెలకొరిగినట్లు అధికారులు తెలిపారు.

సింగిల్​ ఇంజిన్​ సెస్నా 208 విమానం హ్యూస్టన్‌లోని బుష్​ ఇంటర్‌కాంటినెంటల్​ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టెక్సాస్‌లోని ఫుల్‌షీర్ సమీపంలో ఓ పారాగ్లైడర్​ను ఢీకొని ఉదయం 9.40 గంటల సయమంలో కూలిపోయినట్లు ఫెడరల్​ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. విమానంలో ప్రయాణించిన వ్యక్తితోపాటు పారాగ్లైడర్ మరణించినట్లు వెల్లడించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొంది.

ఇదీ చదవండి:US Omicron death: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం

Last Updated : Dec 22, 2021, 12:00 PM IST

ABOUT THE AUTHOR

...view details