తెలంగాణ

telangana

బ్రిటన్​పై కరోనా పంజా- కథ మళ్లీ మొదటికి!

By

Published : Sep 25, 2020, 6:54 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటివరకు 3,23,94,957 కేసులు నమోదయ్యాయి. 9.8లక్షలమంది వైరస్​కు బలయ్యారు. బ్రిటన్​లో వైరస్​ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.

Latest updates on worldwide corona virus cases
బ్రిటన్​పై కరోనా పంజా.. వైరస్​ కథ మళ్లీ మొదటికి!

కరోనా వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,23,94,957మందికి వైరస్​ సోకింది. 9,87,066మంది వైరస్​ ధాటికి బలయ్యారు. అమెరికా, ఐరోపాలో తీవ్రత మళ్లీ పెరుగుతోంది.

బ్రిటన్​లో...

బ్రిటన్​లో పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 6వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.

వైరస్​ విజృంభణపై వైద్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అనుభవాల నుంచి బ్రిటన్​ పాఠాలు నేర్చుకోలేదని విమర్శిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 4,16,363 కేసులు వెలుగుచూశాయి. 41,902మంది మరణించారు.

ప్రపంచ దేశాల పరిస్థితి ఇలా...

దేశం కేసులు మృతులు
అమెరికా 71,84,980 207,516
బ్రెజిల్​ 46,59,909 1,39,883
రష్యా 11,28,836 19,948
కొలంబియా 7,90,823 24,924
పెరూ 7,82,695 31,870
మెక్సికో 7,10,049 74,949
స్పెయిన్​ 7,04,209 31,118
అర్జెంటీనా 6,78,266 14,766
దక్షిణాఫ్రికా 6,67,049 16,283

ఇదీ చూడండి:-2021కల్లా చైనా 'కరోనా వ్యాక్సిన్'​!

ABOUT THE AUTHOR

...view details