తెలంగాణ

telangana

Voice Behind Bigg Boss Season 7 Telugu: బిగ్​బాస్​ హౌస్​లో వినిపించే గొంతు ఎవరిదో కాదు.. ఇతనిదే..!

By ETV Bharat Telugu Team

Published : Sep 13, 2023, 5:22 PM IST

Voice Behind Bigg Boss Season 7 Telugu : "బిగ్​బాస్"​.. తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేని షో. ఇప్పటికే సక్సెస్​ఫుల్​గా ఆరు సీజన్లు కంప్లీట్​ చేసుకుని.. ఏడో సీజన్​ రన్​ అవుతోంది. అయితే.. బిగ్​బాస్​లో అందరినీ ఆకట్టుకునే అంశం.. బ్యాగ్రౌండ్​లో వచ్చే వాయిస్​. మరి, ఆ వాయిస్ ఎవరిదో తెలుసా..?

Who is The Person Behind Bigg Boss 7 Voice Telugu
Voice Behind Bigg Boss Season 7 Telugu

Voice Behind Bigg Boss Season 7 Telugu : తెలుగులో అతిపెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇప్పటికీ 6 సీజన్స్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో సీజన్‍ కొనసాగుతోంది. అయితే.. సీజన్​ 1 నుంచి.. ఇప్పటి సీజన్​ 7 వరకు బిగ్​బాస్​ షోలో ఎన్నో మార్పులు జరిగాయి. హోస్ట్ ల నుంచి గెస్టుల దాకా.. ఎన్నోరకాల ఛేెెెంజెస్ వచ్చాయి. కానీ.. మారనిది మాత్రం ఒకటుంది. అదే బిగ్ బాస్ వాయిస్​.

2017 సంవత్సరం తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ షో అతిపెద్ద రియాలిటీ షోగా పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ ఆరు టెలివిజన్, 1 ఓటీటీ సీజన్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ 7 తెలుగు సీజన్ ప్రారంభమైన 10 రోజులైంది. ఇన్ని సీజన్స్ గడిచినా.. బిగ్ బాస్ వాయిస్‍ మాత్రం తెలుగు ప్రేక్షకులకు బోర్ కొట్టలేదనే చెప్పాలి. ఇప్పటికీ.. ఆ వాయిస్​కు మంచి క్రేజ్ ఉంది. బిగ్ బాస్ చెప్పినట్లే.. హౌజ్ కంటెస్టెంట్స్ అంతా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎంతో గాంభీర్యంగా ఉండే ఆ వాయిస్ ఎవరిది..? అనే ఆసక్తి ఎప్పట్నుంచో ఆడియెన్స్ లో ఉంది. ఆ వ్యక్తి ఎవరనే విషయం ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఆ వాయిస్ వెనుక ఉన్న వ్యక్తి పేరు రాధాకృష్ణ. (Bigg Boss Telugu Voice Radhakrishna) అలియాస్ రేనుకుంట్ల శంకర్ అనే ప్రచారం సాగుతోంది.

Bigg Boss 7 Telugu First Week Elimination: బిగ్​బాస్​ ఫస్ట్​ వీక్​.. ఎలిమినేట్ అయ్యేది అతనా? ఆమెనా..??

రేనుకుంట్ల శంకర్ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్. బిగ్ బాస్ కంటే ముందు అనేక సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. అంతేకాకుండా.. పలు సీరియల్స్, అడ్వర్టైజ్‌మెంట్స్​లో కూడా తన గొంతును వినిపించారు. కాగా, బిగ్ బాస్ వాయిస్ కోసం శంకర్‍ను అంత ఈజీగా సెలెక్ట్ చేయలేదట. తెలుగులో బిగ్ బాస్ షోని ప్రారంభించాలనుకున్నప్పుడు నిర్వాహకులు.. సుమారు 100 మందిని పరీక్షించారట. వారందరిలో శంకర్ గొంతు బాగుంటుందని డిసైడ్ అయ్యారట. శంకర్ మాటల్లో గాంభీర్యం నచ్చి ఆయనకు అవకాశం ఇచ్చారని సమాచారం.

ఇదిలా ఉంటే రేనుకుంట్ల శంకర్ బిగ్ బాస్‍తోపాటు అప్పట్లో తెలుగులో డబ్ అయిన సీఐడీ క్రైమ్ సీరియల్‍కు సైతం తన గాత్రాన్ని అందించారు. తొలి మూడు, నాలుగు సీజన్లలో ఒకలా మాట్లాడిన శంకర్.. తర్వాత తన మాడ్యులేషన్ కాస్తా మార్చారు. ఇక అప్పటి నుంచి అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఇక.. ప్రస్తుతం బిగ్ బాస్ 7 సీజన్ గురించి చూస్తే.. 14 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. వీరిలో ఫస్ట్​ వీక్​లో కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయి ఇంటి నుంచి వెళ్లిపోయింది. మరి రెండో వారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారో తెలియాలంటే.. మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

Bigg Boss Subhashree : పవన్ కల్యాణ్ OGలో బిగ్ బాస్ -7 బ్యూటీ.. పాప మస్త్ అందంగా ఉందిగా!

Bigg Boss Telugu 7: ఆ ఐదుగురికి నాగ్​ లక్షల ఆఫర్.. హీరో కంటెస్టెంట్​ టెంప్ట్​.. ఫైనల్ ట్విస్ట్ సూపర్​ భయ్యా!

ABOUT THE AUTHOR

...view details