ETV Bharat / entertainment

మరింత కొత్తగా 'బిగ్‌బాస్‌ 7'.. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌'..

author img

By

Published : Jul 19, 2023, 6:54 AM IST

Updated : Jul 19, 2023, 9:00 AM IST

Bigg Boss 7 Telugu Promo : టాలీవుడ్ స్టార్​ హీరో నాగార్జున వ్యాఖాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో 'బిగ్​బాస్'​ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుని త్వరలో ఏడవ సీజన్​తో సందడి చేయనుంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన ప్రోమో ఆడియెన్స్​లో అంచనాలను పెంచేస్తోంది. మీరు కూడా దాన్ని చూసేయండి మరి..

biggboss 7 promo
biggboss 7 promo

Bigg Boss 7 Telugu Promo : తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ రియాలిటీ షో 'బిగ్‌ బాస్‌' త్వరలో ఏడో సీజన్‌తో మన ముందుకు రానుంది. ఇప్పటి వరకు ఆరు సీజన్లతో సందడి చేసిన ఈ పాపులర్​ షో.. ఇంకొన్ని రోజుల్లో ప్రసారం కానుంది. మంగళవారం దీనికి సంబంధిన తాజా ప్రోమో ఒకటి విడుదలైంది. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో, ప్రోగ్రాం హోస్ట్​ అక్కినేని నాగార్జున కనిపించి ప్రేక్షకులను అలరించారు. అయితే ఈ సారి రొటీన్​కు భిన్నంగా ఓ కొత్త కాన్సెప్ట్​తో రానున్నట్లు ఆయన ఓ హింట్ ఇచ్చారు. 'కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్‌' అంటూ ఈ షో పై ఆడియన్స్​కు మరింత ఆసక్తి పెంచారు.

Bigg Boss 7 Host : అయితే గతంలో 'బిగ్‌బాస్‌ 7' తెరపైకి రానున్న నేపథ్యంలో ఈ సీజన్​కు ఎవరు హోస్ట్​గా వ్యవహరించనున్నారన్న విషయంపై పలు రూమర్స్​ వెలువడ్డాయి. గత సీజన్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున.. ఈ సీజన్​కు రాకపోవచ్చన్న వార్తలు సైతం నెట్టింట హల్​చల్​ చేశాయి. అయితే వాటన్నింటికి ఈ తాజా ప్రోమోతో చెక్​ పెట్టినట్లు అయ్యింది. మొద‌టి సీజ‌న్‌కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, రెండో సీజ‌న్‌కు నేచురల్​ స్టార్​ నాని హోస్ట్‌గా చేయ‌గా.. 3, 4, 5, 6 సీజన్లకు నాగార్జునే వ్యాఖ్యాతగా వ్యవహరించి, అలరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటి సీజన్​కు కూడా ఆయనే హోస్ట్​గా వచ్చి సందడి చేయనున్న విషయం కన్ఫార్మ్​ అయ్యింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రముఖ ఓటీటీ ఛానల్​ 'డిస్నీ ప్లస్​ హాట్‌స్టార్‌' లోనూ స్ట్రీమింగ్‌ కానుంది.

కంటెస్టంట్స్​ ఎవరంటే..
ఈ సీజన్​లో శ్వేతా నాయుడు, యాంకర్ ధనుశ్​, కార్తిక దీపం ఫేమ్​ శోభితా శెట్టి.. ఈ సారి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ​అమర్ దీప్ చౌదరి, తేజస్విని గౌడ కూడా రానున్నారని సమాచారం. అసలు వీరు గత సీజన్​లోనే వస్తారని ప్రచారం సాగింది. కానీ ఆ సమయంలో అది కుదరలేదట. దీంతో ఈ సీజన్​కు గట్టి ప్లాన్స్​ చేస్తున్నారని టాక్​. ఇక ఇటీవలే బాగా పాపులరైన ఆట సందీప్, జ్యోతి జంట కూడా ఈ సీజన్​లో కనిపించనున్నారట.

Last Updated :Jul 19, 2023, 9:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.