తెలంగాణ

telangana

'నేను అలా అనలేదు.. ఆయన చాలా పెద్ద స్టార్​'.. ప్రభాస్​తో క్లాష్​పై వివేక్​ క్లారిటీ

By

Published : Jul 28, 2023, 10:29 AM IST

Vivek Agnihotri Prabhas : ప్రముఖ నటుడు ప్రభాస్​పై తాను అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వచ్చిన వార్తలను.. 'ది కశ్మీర్​ ఫైల్స్'​ డైరెక్టర్ వివేక్​ అగ్నిహోత్రి ఖండించారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్​ చాలా పెద్ద స్టార్​ అని కొనియాడారు. తమ మధ్య ఎలాంటి పోలిక లేదన్నారు. ఇంకా ఏమన్నారంటే?

vivek agnihotri prabhas
vivek agnihotri prabhas

Vivek Agnihotri Prabhas : 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే ఈయన.. మరోసారి వివాదంలో చిక్కున్నారు. అగ్నిహోత్రి ఈ మధ్య ప్రభాస్​పై నోరు పారేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అగ్నిహోత్రి క్లారిటీ ఇచ్చారు. 'ప్రభాస్‌ సినిమాతో మరోసారి పోటీ పడుతున్నాననే మాటలను.. నాకు ఆపాదించి ఎవరు ఈ తప్పుడు వార్తలు వ్యాపింపజేస్తున్నారు? నాకు ప్రభాస్‌పై అమితమైన గౌరవం ఉంది. ఆయన మెగా.. మోగా స్టార్‌. అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు చేస్తుంటారు. కానీ, మేము స్టార్‌ నటీనటులు లేకుండా తక్కువ బడ్జెట్‌లో ప్రజల కోసం చిత్రాలు చేస్తుంటాం. మా మధ్య ఎలాంటి పోలికల్లేవు. దయచేసి నన్ను వదిలేయండి' అంటూ వివేక్​ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇదీ జరిగింది:
Vivek Agnihotri Next Film : వివేక్‌ అగ్నిహోత్రి ప్రస్తుతం 'ది వ్యాక్సిన్‌ వార్‌' అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ప్రచారంలో భాగంగా ఇటీవల ఆయన ఆంగ్ల మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చారు. 'రామాయణం', 'మహాభారతం' ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని సినిమాలు చేసేవారిని ఉద్దేశిస్తూ.. ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఫ్రీ లైఫ్‌కు అలవాటు పడిన కొందరు నటులు.. దేవుళ్ల పాత్రల్లో నటిస్తే ప్రేక్షకులు అంగీకరించరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా చర్చ మొదలైంది.

ఈ క్రమంలోనే, ఓ ట్వీట్‌ కూడా సోషల్​ మీడియాలో వైరల్​ అయింది. 'రాధేశ్యామ్‌' సినిమా విడుదలైన సమయంలో 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'ను రిలీజ్‌ చేసి నేను విజయాన్ని అందుకున్నా. ఇప్పుడు మరోసారి ఆ పోటీని కొనసాగిస్తూ 'సలార్‌'పై 'ది వ్యాక్సిన్‌ వార్‌'ను విడుదల చేయాలనుకుంటున్నా' అని ఆ ట్వీట్‌లో ఉంది. దానిపైనే తాజాగా వివేక్ అగ్నిహోత్రి స్పష్టత ఇచ్చారు.

Vaccine War Movie Cast : భారతీయ జీవశాస్త్రవేత్తలు, వారు అభివృద్ధి చేసిన స్వదేశీ వ్యాక్సిన్‌లు.. కథాంశంగా వివేక్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్' తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దసరా నాటికి 11 భాషల్లో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్​ నటుడు అనుపమ్ ఖేర్, రైమా సేన్, సప్తమి గౌడ, నానా పటేకర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.

ABOUT THE AUTHOR

...view details