ETV Bharat / entertainment

సుకుమార్​-వివేక్​ అగ్రిహోత్రి సడెన్​ సర్​ప్రైజ్​.. ఏంటో గెస్ చేయగలరా?

author img

By

Published : Nov 4, 2022, 4:41 PM IST

Updated : Nov 4, 2022, 4:57 PM IST

'పుష్ప', 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' దర్శకులు సుకుమార్​ వివేక్​ అగ్నిహోత్రి సినీప్రేక్షకులకు సడెన్ సర్​ప్రైజ్ ఇచ్చారు. ఏంటంటే?

sukumar vivek agnihotri
సుకుమార్​-వివేక్​ అగ్రిహోత్రి సడెన్​ సర్​ప్రైజ్​.. ఏంటో గెస్ చేయగలరా

'పుష్ప' సినిమాతో దర్శకుడు సుకుమార్‌, 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'తో వివేక్‌ అగ్నిహోత్రి జాతీయ స్థాయిలో ఎంతటి హిట్ అందుకున్నారో తెలిసిన విషయమే. అలాంటిది వీరిద్దరి కాంబోలో ఓ చిత్రం వస్తే.. ఊహే చాలా బాగుంది కదూ. ఇప్పుడా ఊహే నిజమవ్వబోతుంది. ఈ విషయాన్ని వీరిద్దరే స్వయంగా తెలుపుతూ సినీ ప్రేక్షకులకు సడెన్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

'సినిమాతో అంతా ఒక్కటికాబోతున్నాం. వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. మీరు ఏమైనా గెస్‌ చేస్తారా?' అంటూ వివేక్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. దర్శకుడు సుకుమార్‌, 'ది కశ్మీర్‌ ఫైల్స్‌', 'కార్తికేయ 2' చిత్రాల నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌తో కలిసి దిగిన ఫొటోలను ఆయన పంచుకున్నారు. దాంతో, 'ఈ ముగ్గురు ఎలాంటి సంచలనం సృష్టిస్తారో' అనే ఆసక్తి సినీ ప్రియుల్లో రేకెత్తుతోంది. కానీ.. వీరిలో ఎవరు దర్శకుడిగా పనిచేస్తారు? ఎవరెవరు నిర్మాతలుగా వ్యవహరిస్తారు? అన్న దానిపై స్పష్టత లేదు. మరి, ఈ క్రేజీ కాంబోలో నటించే హీరోహీరోయిన్లు ఎవరు? దానికి డైరెక్టర్‌ ఎవరు? నిర్మాత ఎవరు? తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం 'పుష్ప 2'తో బిజీగా ఉన్నారు సుకుమార్‌. మరోవైపు, సుకుమార్‌.. రామ్‌ చరణ్‌తో ఓ సినిమా ప్లాన్‌ చేశారనే వార్తలూ వస్తున్నాయి. 'చాక్లెట్‌' అనే హిందీ సినిమాతో దర్శకుడిగా మారిన వివేక్‌ 'గోల్‌', 'హేట్‌ స్టోరీ', 'ది తాష్కెంట్‌ ఫైల్స్‌'లతో బాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు. 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'తో టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందారు. ప్రస్తుతం వివేక్‌.. 'ది దిల్లీ ఫైల్స్‌' రూపొందించే పనుల్లో బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

Last Updated : Nov 4, 2022, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.