ETV Bharat / entertainment

'కశ్మీర్​ ఫైల్స్​' వివాదం.. యాక్టర్​, డైరెక్టర్​ మధ్య మాటల యుద్ధం

author img

By

Published : Feb 9, 2023, 6:41 PM IST

vivek agnihotri  comments on prakash raj kashmir files
vivek agnihotri comments on prakash raj kashmir files

'ది కశ్మీర్​ ఫైల్స్'​ సినిమాపై వివాదం ఇంకా కొనసాగుతోంది. నటుడు ప్రకాశ్​రాజ్​, డైరెక్టర్ వివేక్​ అగ్నిహోత్రి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. ఇటీవల ప్రకాశ్​రాజ్​ చేసిన వ్యాఖ్యలపై వివేక్​ అగ్నిహోత్రి స్పందిస్తూ.. 'అంధకార్​ రాజ్​' అంటూ ఘాటు కామెంట్లు చేశారు.

'కశ్మీర్​ ఫైల్స్​'.. గతేడాది విడులైన ఈ సినిమా చాలా వివాదాస్పదమైంది. ఈ చిత్రంపై.. సినీ ఇండస్ట్రీ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా, ఈ సినిమా గురించి డైరెక్టర్ వివేక్​ అగ్నిహోత్రి, నటుడు ప్రకాశ్​రాజ్​ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరి నొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. 'కశ్మీర్​ ఫైల్స్'​కు భాస్కర్​ అవార్డు ఇవ్వాలి' అని.. ప్రకాశ్​ రాజ్​ అంటే.. 'అతడు ఓ అర్బన్​ నక్సల్​' అంటూ వివేక్​ అగ్నిహోత్రి తీవ్రంగా స్పందించారు.

ప్రకాశ్​రాజ్​ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి.. గురువారం సోషల్​ మీడియా వేదికగా స్పందించారు. ప్రకాశ్​రాజ్​ను 'అర్బన్ నక్సల్'​ అని అన్నారు. "ఓ చిన్న, ప్రజల చిత్రం అయిన 'ది కశ్మీర్ ఫైల్స్'.. అర్బన్ నక్సల్స్​కు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. ఎంతగా అంటే, వాళ్లలో ఒకడైన వ్యక్తిని.. వచ్చిన సంవత్సరం తర్వాత కూడా కశ్మీర్​ ఫైల్స్ వేధిస్తోంది. ఆ చిత్రాన్ని చూసిన ప్రేక్షకులను మొరిగే కుక్కలని అంటున్నాడు. 'మిస్టర్ అంధకార్ రాజ్' నాకు భాస్కర్ ఎలా దక్కుతుంది. అతడు/ఆమె ఎప్పటికే మీ సొంతమే" అంటూ ప్రకాశ్​రాజ్​ చేసిన వ్యాఖ్యల వీడియోను జత చేసి ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

​కాగా, అంతకుముందు ప్రకాశ్​రాజ్​.. 'మాతృభూమి ఇంటర్నేషనల్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ లేటర్స్‌ ఇన్‌ కేరళ' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ది కశ్మీర్​ ఫైల్స్​' సినిమా గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. " 'ది కశ్మీర్‌ ఫైల్స్‌' సినిమా ఓ నాన్సెన్స్ ఫిల్మ్. కానీ ఈ సినిమాను ఎవరు నిర్మించారో మనకు తెలుసు. అంతర్జాతీయ జ్యూరీ వాళ్లపై ఉమ్మేసింది. అయినా వాళ్లకు సిగ్గు రాలేదు. ఆ చిత్ర దర్శకుడు ఇప్పటికీ.. 'నాకు ఎందుకు ఆస్కార్ రాలేదు‌?" అని మాట్లాడుతున్నాడు. అతడికి ఆస్కార్‌ కాదు కదా.. భాస్కర్‌ అవార్డు కూడా రాదు. ఇలాంటి ప్రచార చిత్రాలు తీయడానికి కొంతమంది రూ. 2000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని నాకు తెలిసిన వాళ్లు చెప్పారు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే కార్యక్రమంలో ఆయన 'బాయ్‌కాట్‌ పఠాన్‌' అంశంపైనా మాట్లాడారు. 'మొరిగే కుక్కలు కరవవు' అనే సామెత వాళ్లకు సరిపోతుందని అన్నారు.
1990ల్లో కశ్మీర్​లో జరిగిన ఊచకోతపై వివేక్ అగ్నిహోత్రి 'కశ్మీర్ ఫైల్స్' సినిమా తీశారు. గతేడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా అంతటా మంచి టాక్‌ సొంతం చేసుకుంది. అనుపమ్‌ ఖేర్‌, దర్శన్‌ కుమార్‌, మిథున్‌ చక్రవర్తి, పల్లవి జోషీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. గతేడాది విడుదలైన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ దగ్గర భారీగా కలెక్షన్లు సాధించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.