తెలంగాణ

telangana

Varun Lavanya Haldi Photos : వరుణ్‌, లావణ్యల హల్దీ వేడుక ఫొటోలు వైరల్​.. మీరు చూశారా?

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 9:58 PM IST

Updated : Oct 31, 2023, 11:01 PM IST

Varun Lavanya Haldi Photos : వరుణ్​ తేజ్​-లావణ్య హల్దీ వేడుక ఫొటోలు వైరల్​ అవుతున్నాయి. మెగా అభిమానులు ఆ ఫొటోలను సోషల్​ మీడియాలో తెగ షేర్​ చేస్తూ.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ ఫొటోలు మీరు చూశారా?

Varun Lavanya Haldi Photos
Varun Lavanya Haldi Photos

Varun Lavanya Haldi Photos :మెగా ప్రిన్స్​ వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి మరికొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. వీరి పెళ్లి నవంబరు 1న ఇటలీలో జరగనుంది. అందులో భాగంగా అక్టోబరు 30న కాక్​టెయిల్ పార్టీ జరిగగా.. 31న హల్దీ వేడుక నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధిత ఫొటోలు బయటకు వచ్చాయి. వాటిని మెగా అభిమానులు నెట్టింట్లో తెగ షేర్ చేస్తున్నారు. దీంతో అవి కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారాయి. వాటిలోని ఓ ఫొటోలో వరుణ్‌, లావణ్య ఒకరినొకరు చూసుకుంటూ కనిపించారు. మరో ఫొటోలో చిరంజీవి, ఇంకో ఫొటోలో నాగబాబు ఆయన సతీమణితో కనిపించారు. కాగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న ఈ మెగా జంట హల్దీ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. మరోవైపు, కాక్‌టేల్‌ పార్టీకి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో ఇప్పటికే చక్కర్లు కొట్టాయి.

Varun Tej Marriage Italy : పెళ్లి వేడుక కోసం మెగా, అల్లు కుటుంబాలు ఇప్పటికే ఇటలీ చేరుకున్నాయి. హీరో నితిన్, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన కూడా వివాహానికి హాజరుకానున్నారు. ఇటలీలో చిన్నగా రిషెప్షన్ ఉంటుంది. ఇక సినీ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో నవంబరు 5న రిసెప్షన్‌ ఏర్పాటు చేయనున్నారు. వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి కలిసి 'మిస్టర్', 'అంతరిక్షం' చిత్రాల్లో నటించారు. ఈ చిత్రాల షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 'హైదరాబాద్‌లో పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం. కానీ, ప్రైవేట్‌ వ్యవహారంగా ఉంచాలనుకోవడం వల్ల అది ఇక్కడ సాధ్యంకాదు. అందుకే డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేశాం'' అని వరుణ్‌ తేజ్‌ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

వివాహానికి మెగాస్టార్ చిరంజీవి తల్లి దూరం..
Varun Lavanya Marriage :మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి మెగాఫ్యామిలీలో ప్రధానమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి ఈ పెళ్లికి హాజరు కావటం లేదని సమాచారం. ఆరోగ్య సమస్య కారణంగా వైద్యుల సూచనల మేరకు ఆమె ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహ వేడుకను ఇంటి దగ్గర నుంచే ప్రత్యక్షంగా చూసే విధంగా చిరంజీవి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

Varun Lavanya Wedding : ఇటలీకి పయనమైన సమంత​, చైతూ.. వారితో పాటు ఆ స్టార్​ హీరోయిన్ కూడా..

Varun Tej Lavanya Tripathi Wedding : ఆ ముహూర్తానికే వరుణ్​ - లావణ్య పెళ్లి ఎందుకో తెలుసా?.. ఇదే కారణం!

Last Updated :Oct 31, 2023, 11:01 PM IST

ABOUT THE AUTHOR

...view details