ETV Bharat / entertainment

Varun Lavanya Marriage : వరుణ్​- లావణ్య పెళ్లికి చిరంజీవి తల్లి దూరం.. కారణమిదే!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 29, 2023, 5:50 PM IST

Varun Lavanya Marriage : వరుణ్​ తేజ్-లావణ్య వివాహ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఇటలీ చేరుకుంటున్నారు. అయితే మెగాఫ్యామిలీలో ప్రధానమైన వ్యక్తి పెళ్లికి హాజరు కావడం లేదట సమాచారం. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే..? ​

Varun Lavanya Marriage
Varun Lavanya Marriage

Varun Lavanya Marriage : మెగా ప్రిన్స్​ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు మూళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటలీలోని టస్కానీ వేదికగా ఈ వివాహ వేడుక గ్రాండ్​గా జరగనుంది. ఇప్పటికే వధూవరులతో పాటు మెగా కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే మెగాఫ్యామిలీలో ప్రధానమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి ఈ పెళ్లికి హాజరు కావటం లేదని సమాచారం. ఆరోగ్య సమస్య కారణంగా వైద్యుల సూచనల మేరకు ఆమె ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహ వేడుకను ఇంటి దగ్గర నుంచే ప్రత్యక్షంగా చూసే విధంగా చిరంజీవి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

మరోవైపు అందరికంటే ముందుగా రామ్‌ చరణ్‌-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్​- లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్‌ తన ఫ్యామిలీతో వెళ్లారు. ఇలా రామ్‌ చరణ్‌, బన్నీ ఇద్దరూ కలిసి వరుణ్‌ పెళ్లి ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు తమ సోషల్ మీడియా ద్వారా లేటెస్ట్​ ఫోటోలను షేర్​ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉపాసన కూడా ఓ గ్రాండ్ ఫ్యామిలీ ఫొటోను షేర్​ చేశారు. అందులో మెగా, కామినేని ఫ్యామిలీలు ఒకే ఫ్రేమ్​లో కనిపించి సందడి చేశాయి. చిన్నారి క్లీంకార కూడా ఆ ఫొటోలో కనిపించింది. ఇక వరుణ్​ తేజ్, లావణ్య కూడా ఒకరి ఫోటలు ఒకరు షేర్ చేశారు. ​

Varun Lavanya Wedding : ఇక వివాహ విషయానికొస్తే.. పెళ్లి వేడుక నాలుగు రోజులు పాటు జరగనుంది. అక్టోబర్ 30న రాత్రి సంగీత్ పార్టీ, అక్టోబర్ 31న ఉదయం హల్దీ, సాయంత్రం మెహందీ వేడుకలకు ప్లాన్​ చేశారు. నవంబర్​ 1న పెళ్లి జరగనుంది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు హాజరుకానున్నారట. ఇక పెళ్లి అనంతరం నవంబర్​ 5న హైదరాబాద్​లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. అయితే పెళ్లికి హాజరు కానీ సినీ, రాజకీయ ప్రముఖుల ఈ రిసెప్షన్​కు హాజరుకానున్నారని సమాచారం.

Varun Lavanya Marriage : ఇటలీ బయల్దేరిన పవన్‌, అల్లు అర్జున్​ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్!

Varun Lavanya Wedding Invitation : వరుణ్​- లావణ్య వెడ్డింగ్​ కార్డు చూశారా? ఆ ముగ్గురి పేర్లు టాప్​లో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.