తెలంగాణ

telangana

'నువ్వే నా ఇన్​స్పిరేషన్ - నిన్ను చూసి నేను చాలా నేర్చుకోవాలి'

By ETV Bharat Telugu Team

Published : Dec 15, 2023, 6:33 AM IST

Updated : Dec 15, 2023, 7:16 AM IST

Sreeleela Mrunal Thakur : నాని, మృణాల్ ఠాకూర్​ లీడ్ రోల్స్​లో తెరకెక్కిన హాయ్​ నాన్న మూవీ ప్రస్తుతం మంచి టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద సక్సెస్​ఫుల్​గా దూసుకెళ్తో్ంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు, ప్రముఖులు సోషల్ మీడియాలో చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తాజాగా యంగ్​ బ్యూటీ శ్రీలీల కూడా 'హాయ్​ నాన్న' చూసిందట. ఇంతకీ ఆమె స్పందన ఏంటంటే ?

Sreeleela Mrunal Thakur
Sreeleela Mrunal Thakur

Sreeleela Mrunal Thakur :నేచురల్ స్టార్ నాని, మృణాల్‌ ఠాకూర్‌ లీడ్​ రోల్స్​లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'హాయ్‌ నాన్న'. కొత్త డైరెక్టర్​ శౌర్యువ్‌ తెరకెక్కించిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్సు అందుకుని దూసుకెళ్తోంది. తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్​తో ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్​గా రూపొందిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచే కాకుండా ప్రముఖుల నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని తెలియజేసింది యంగ్ బ్యూటీ శ్రీలీల. ఎన్నో ఎమోషన్స్​తో నిండివున్న ఈ సినిమా తనకెంతో నచ్చిందని కామెంట్ చేసింది

"హాయ్‌ నాన్న ఇదొక ఎమోషనల్‌ స్టోరీ గల చిత్రం. నాని.. ఈ కథతో మీరు ఎప్పటిలాగానే మా మనసుని తాకారు. మృణాల్‌ యాక్టింగ్, లుక్స్‌ మా హృదయాన్ని దోచుకున్నాయి. ఇక, బేబీ కియారా అయితే ఎంతో క్యూట్‌గా ఉంది. స్క్రీన్‌పై తనని చూసిన ప్రతి ఒక్కరూ కిడ్నాప్‌ చేసేయాలనుకున్నారు. కంగ్రాట్స్‌ శౌర్యువ్‌. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు" అంటూ 'హాయ్​ నాన్న' టీమ్​ను శ్రీలీల పొగడ్తలతో ముంచెత్తారు. దీన్ని పై మృణాల్​ తాజాగా స్పందించారు.

"థ్యాంక్యూ సో మచ్‌ మై స్వీట్‌ హార్ట్‌. నీకు ఈ సినిమా నచ్చినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నీ నుంచి నేను ఎంతో స్ఫూర్తి పొందాను. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు వర్క్‌ చేయడం అంత ఈజీ విషయం కాదు. అందుకే నీ విషయంలో నేనెంతో గర్వపడుతున్నాను" అని రిప్లై ఇచ్చింది.

ఇక దీనిపై శ్రీలీల కూడా మరోసారి స్పందించింది. "మీ మాటలు నాకెంతో విలువైనవి. నాకు ఆనందాన్నిచ్చాయి" అని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్​ నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి. దీన్ని చూసిన ఫ్యాన్స్ ఈ ఇద్దరూ ఎంతో క్యూట్​గా మాట్లాడుకున్నారంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు.

గతేడాది విడుదలైన 'ధమాకా', 'సీతారామం' సినిమాలతో టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ సొంతం చేసుకున్నారు శ్రీలీల, మృణాల్ ఠాకూర్. తాజాగా ఈ ఇద్దరి మూవీస్ బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్డాయి. మృణాల్‌ నటించిన ‘హాయ్‌ నాన్న’ విడుదలైన మరుసటి రోజు శ్రీలీల నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌' మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతుండగా, 'హాయ్‌ నాన్న' హిట్ అందుకుంది.

'మిమ్మల్ని ఇలా కలవడం అదృష్టంగా భావిస్తున్నాను - త్వరలోనే పెళ్లి చేసుకుంటాను'

జోరు తగ్గించిన శ్రీలీల - ఆ ఇద్దరిలో ఈ యంగ్ బ్యూటీకి ఎవరు బ్రేక్ ఇస్తారో?

Last Updated : Dec 15, 2023, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details