తెలంగాణ

telangana

Saindhav Teaser : సైకో సైంధవ్​.. వెంకటేశ్ ఊచకోత.. పవర్​ఫుల్​గా యాక్షన్​ టీజర్​

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 12:53 PM IST

Updated : Oct 16, 2023, 2:37 PM IST

Saindhav Teaser : విక్టరీ వెంకటేశ్ నటించిన లేటెస్ట్ మూవీ 'సైంధవ్' టీజర్​ పవర్​ఫుల్​గా ఉంది. మీరు చూశారా?

Saindhav Teaser : సైకో సైంధవ్​.. వెంకటేశ్ ఊచకోత.. పవర్​ఫుల్​గా యాక్షన్​ టీజర్​
Saindhav Teaser : సైకో సైంధవ్​.. వెంకటేశ్ ఊచకోత.. పవర్​ఫుల్​గా యాక్షన్​ టీజర్​

Saindhav Teaser :లెక్కమారుతుందంటూ 'సైంధవ్‌' టీజర్‌తో అదరగొట్టేశారు హీరో వెంకటేశ్. శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ టీజర్​ చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో వెంకటేశ్​ తన పవర్​ఫుల్​ యాక్షన్​, డైలాగ్స్​తో ఆకట్టుకున్నారు. తండ్రి కూతుళ్ల సెంటిమెంట్‌తో ఈ సినిమా సాగనుంది. భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం వెంకటేశ్​కు తొలి పాన్‌ ఇండియా సినిమా కావడం విశేషం. ఇందులో శ్రద్ధా శ్రీనాథ్‌, రుహాని శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. .

ఫ్యామిలీ ఎపిసోడ్స్‌తో ప్రారంభమైన ఈ టీజర్​లో చంద్ర‌ప్ర‌స్థ అనే ఊరిలో త‌న భార్య‌, కూతురితో క‌లిసి వెంక‌టేశ్ సంతోషంగా జీవిస్తుంటాడు. ఆ త‌ర్వాత విలన్​ న‌వాజుద్దీన్ సిద్ధిఖీ ఎంట్రీతో కంప్లీట్ యాక్ష‌న్ మోడ్‌లోకి వెళ్లిపోయింది. వికాస్ అనే క‌రుడుగుట్టిన క్రిమిన‌ల్‌గా, త‌న‌కు ఎదురొచ్చిన వారంద‌రిని దారుణంగా చంపేస్తూ న‌వాజుద్ధీన్ సిద్ధిఖీ క‌నిపించారు. బ్లడ్ సీన్స్​ ఎక్కువగానే కనిపించాయి. పీకలు కోయడం, కత్తి పట్టి నరకడం వంటి సీన్లను చూపించారు. అనంతరం విలన్ దృష్టిలో సైకోగా వెంక‌టేశ్​ను​.. ఓ సారి క‌త్తితో మ‌రోసారి గ‌న్​తో శ‌త్రు సంహారం చేస్తూ ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించారు.

వెంక‌టేశ్​పై చిత్రీక‌రించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ హైలైట్‌గా ఉన్నాయి. 'వెళ్లేముందు చెప్పెళ్ల‌... విన‌లేదు. అంటే భ‌యం లేదు. లెక్క మారుద్దిరా నా కొడ‌క్క‌ల్లారా' అంటూ టీజ‌ర్ చివ‌ర‌లో వెంక‌టేక్ ఊచకోత కోశారు. డైలాగ్‌ కూడా అదిరిపోయింది. చిన్న‌ పిల్ల‌ల‌కు గ‌న్ ట్రైనింగ్ ఇచ్చి.. టెర్ర‌రిస్ట్ ఆర్గ‌నైజేష‌న్‌కు స‌ప్లై చేసే గ్యాంగ్‌ను ఎదురించే వ్య‌క్తిగా వెంక‌టేశ్​ కనిపిస్తున్నారు. సంతోశ్​ నారాయణన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్​ కూడా టీజర్‌ను బాగా ఎలివేట్ చేసింది. వెంకటేశ్​ను మునుపెన్నడూ చూడనంత వైల్డ్‌గా ప్రెజెంట్ చేయడానికి శైలేష్ కొలను ప్రయత్నించినట్లు అర్థమవుతోంది. ఫైనల్​గా ఈ టీజర్​ అంచనాలకు మించి బాగా అదరగొట్టింది.

Saindhav Movie Release Date : ఇకపోతే ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్​గా రిలీజ్​ కానుంది.

Bhagavanth Kesari Vs Tiger Nageswara Rao : బాక్సాఫీస్​ పోటీపై బాలయ్య అలా.. రవితేజ ఇలా.. కామెంట్స్​ వైరల్​

Siddu Jonnalagadda New Movie : ఇద్దరు భామలతో 'డీజే టిల్లు' కొత్త సినిమా.. మనసును తాకేలా వీడియో రిలీజ్​

Last Updated : Oct 16, 2023, 2:37 PM IST

ABOUT THE AUTHOR

...view details