ETV Bharat / entertainment

Siddu Jonnalagadda New Movie : ఇద్దరు భామలతో 'డీజే టిల్లు' కొత్త సినిమా.. మనసును తాకేలా వీడియో రిలీజ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 16, 2023, 11:49 AM IST

Updated : Oct 16, 2023, 12:06 PM IST

Siddu Jonnalagadda New Movie : సిద్దు జొన్నల గడ్డ కొత్త సినిమా అఫీషియల్ అనౌన్స్​మెంట్​ వచ్చేసింది. వీడియో అద్భుతంగా మనసును తాకేలా గ్రాండ్​గా ఉంది. మీరు చూశారా?

Siddu Jonnalagadda New Movie : ఇద్దరు భామలతో 'డీజే టిల్లు' కొత్త సినిమా.. మనసును తాకేలా వీడియో రిలీజ్​
Siddu Jonnalagadda New Movie : ఇద్దరు భామలతో 'డీజే టిల్లు' కొత్త సినిమా.. మనసును తాకేలా వీడియో రిలీజ్​

Siddu Jonnalagadda New Movie : 'గుంటూరు టాకీస్‌', 'కృష్ణ అండ్ హిజ్ లీలా' సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో సిద్దు జొన్నల గడ్డ.. డీజే టిల్లు సినిమాతో యూత్​లో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం డీజే టిల్లు సీక్వెల్‌ 'టిల్లు స్క్వేర్'​తో ఫుల్​ బిజీగా ఉన్నాడు. అయితే ఇతడు.. స్టార్​ డిజైనర్​ నీరజ​ కోనతో ఓ సినిమా చేయబోతున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

Siddu Jonnalagadda Neeraj Kona Movie : తాజాగా ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్​మెంట్ వచ్చేసింది. మేకర్స్​ ఓ స్పెషల్​ వీడియోను రిలీజ్ చేశారు. 'తెలుసు కదా' అనే ఆసక్తికరమైన టైటిల్​ను ఖరారు చేశారు. 'జీవించడానికి ఉన్న ఒకే ఒక దారి.. ప్రేమించడం, ప్రేమించబడటం' అనేది ట్యాగ్ లైన్​. ఈ సినిమాలో కేజీయఫ్​ భామ శ్రీనిధి శెట్టి, రాశిఖన్నా హీరోయిన్స్​గా నటిస్తున్నట్లు తెలిపారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రొడక్షన్​ హౌస్​కు ఇది 30వ సినిమా కావడం విశేషం. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా, వివేక్ కుచిబొట్ల కో ప్రొడ్యూసర్​గా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే వీడియోలో విజువల్స్ ఎంతో రిచ్​గా, ​ గ్రాండ్​గా చూపించారు. ఓ పెద్ద ప్యాలెస్​ అందులో సిద్ధు జొన్నల్లగడ్డ టాప్ టు బాట్ వైట కలర్ సూట్ ధరించి ఎంతో క్లాస్​గా స్టైలిష్​గా నడుస్తూ కనిపించారు. వీడియో చివర్లలో 'తెలుసు కదా' అంటూ చెబుతూ మూగించారు. ఈ వీడియో చూస్తుంటే సినిమా మంచి రిఫ్రెషింగ్ స్టోరీ లైన్​తో రాబోతుందని అర్థమవుతోంది. అలాగే టాప్ క్లాస్​ స్టాండర్డ్స్​తో తెరకెక్కబోతుందని కూడా తెలుస్తోంది. తమన్ అందించిన బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ మనసును తాకేలా ఎంతో వినసొంపుగా అనిపించింది. ఇంకా ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్​ విన్నింగ్ టెక్నిషియన్​ శ్రీకర ప్రసాద్​ ఎడిటర్​గా వ్యవహరించనుండటం విశేషం. అనివాశ్​ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్​గా బాధ్యతలు చూసుకుంటుండగా.. యువరాజ్​ జే డీఓపీ అందిస్తున్నారు.

కాగా, టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీకి పరిచమైన ఆమె నీరజ కోన. బాద్‌షా చిత్రంతో కాస్ట్యూమ్​ డిజైనర్​గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. ఆ తర్వాత పలు స్టార్ హీరోల సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్​గా పని శారు. ఇప్పుడామె దర్శకురాలిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated :Oct 16, 2023, 12:06 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.