తెలంగాణ

telangana

'అందుకే ఆ సినిమా గురించి పోస్ట్ చేశాను - దాన్ని మీరు మరోలా అర్థం చేసుకున్నారు '

By ETV Bharat Telugu Team

Published : Nov 9, 2023, 6:54 AM IST

Updated : Nov 9, 2023, 11:44 AM IST

Nani About Jai Bhim Movie : నేషనల్ అవార్డుల విషయంలో తనపై వస్తున్న విమర్శలపై టాలీవుడ్ హీరో నాని స్పందించారు. తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఆయన అసలు విషయం చెప్పారు.

Nani About Jai Bhim Movie
Nani About Jai Bhim Movie

Nani About Jai Bhim Movie : నేచురల్​ స్టార్​ నాని ప్రస్తుతం 'హాయ్​ నాన్న' మూవీ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ మీడియా సంస్థ నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొన్నారు. అక్కడి యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే ఇటీవలే జాతీయ అవార్డులు ప్రకటించిన సమయంలో నాని పెట్టిన పోస్ట్​ వివాదంగా మారింది. దీంతో ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక ఇదే విషయంపై ఆయన ఈ సమావేశంలో స్పందించారు.

"ఎప్పుడూలేనంతగా ఈసారి తెలుగు సినిమాలకు అధిక సంఖ్యలో జాతీయ అవార్డులు వచ్చాయి. అందుకు నాకు చాలా సంతోషందా అనిపించింది. అయితే తమిళ చిత్రం 'జై భీమ్' ఒక్క కేటగిరీలోనూ అవార్డు దక్కించుకోకపోవడం పట్ల నేను బాధపడ్డాను. అందుకే సోషల్‌ మీడియా వేదికగా హార్ట్‌ బ్రేక్‌ ఎమోజీ పోస్ట్‌ చేశాను. కానీ, దాన్ని మీడియా మరోలా అర్థం చేసుకుంది. కొన్ని వెబ్‌సైట్స్‌ వారు దీనిపై తప్పుగా వార్తలు రాశారు. నెపోటిజం (బంధుప్రీతి) గురించి చిత్ర పరిశ్రమ వారి విషయంలోనే ఎందుకు మాట్లాడతారో నాకు అర్థంకాదు. తండ్రి వృత్తిని చూస్తూ పెరిగిన కొడుకు అదే రంగంలోకి వెళ్లాలనుకుంటాడు కదా" అని నాని క్లారిటీ ఇచ్చారు.

Hi Nanna Movie Cast : ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. 'దసరా' సినిమాతో మాసివ్​ సక్సెస్​ అందుకున్న నాని.. ప్రస్తుతం 'హాయ్​ నాన్న' సినిమాలో నటించారు. ఫాదర్​ అండ్​ డాటర్​ సెంటిమెంట్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని సరసన మృణాల్​ ఠాకూర్​ నటిస్తున్నారు. శౌర్యువ్ అనే కొత్త డైరెక్టర్​ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం కానున్నారు. 'హృదయం', 'ఖుషి' ఫేమ్​ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందించారు. వైరా ఎంటర్​టైన్​మెంట్స్​ పతాకంపై తెరకెక్కుతున్న మోహన్ చెరుకూరి, వీజేందర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్​లో ఈ సినిమా డిసెంబర్​ 7న విడుదల కానుంది. బాలీవుడ్​కు చెందిన చిన్నారి కియారా ఖన్నా కూడా ఈ సినిమా ద్వారా టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

మెలోడియస్​గా 'హాయ్​ నాన్న' అమ్మాడి సాంగ్​ - నాని,మృణాల్​ కెమిస్ట్రీ సూపర్​

'పెద్ద డైరెక్టర్లతో సినిమాలు ఎందుకు చేయట్లేదు?'- హీరో నాని స్టన్నింగ్​ రిప్లై!

Last Updated : Nov 9, 2023, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details