తెలంగాణ

telangana

'ఇలాంటి రోజు వస్తుందని లైఫ్​లో అనుకోలేదు'.. లైవ్ షోలో చిరు పశ్చాత్తాపం!

By

Published : Jan 8, 2023, 5:37 PM IST

ఇలాంటి రోజు వస్తుందని జీవితంలో ఊహించలేదని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇంతకీ చిరు ఎందుకు ఆ మాటలు అన్నారు? తెలుసుకుందాం పదండి..

CHIRANJEEVI SUMA ADDA
CHIRANJEEVI SUMA ADDA

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వెండితెరపైనే కాదు ఎక్కడ కనిపించినా సందడే ఉంటుంది. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆయన తాజాగా బుల్లితెరపై తళుక్కుమన్నారు. సుమ హోస్ట్​గా ఈటీవీలో ప్రసారం కానున్న సరికొత్త సెలెబ్రిటీ టాక్ షో 'సుమ అడ్డా'కు విచ్చేశారు. వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబీ, ప్రముఖ కమెడియన్ వెన్నెల కిశోర్​ సైతం చిరు వెంట షోకు వచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో.. తాజాగా విడుదలైంది. తనదైన పంచులు, కామెడీ టైమింగ్​తో చిరు ఆద్యంతం సందడి చేశారు.

చేతిలో ఉన్న రేఖలలో ఏ రేఖ అంటే భయం అని షోలో అడిగితే సురేఖ అంటూ తన భార్య గురించి చెప్పబోయి ఆగిపోయారు చిరు. దీంతో షోలో నవ్వులు విరిశాయి. దీనికి కొనసాగింపుగా సుమ సైతం తనదైన కామెడీ పంచులు విసిరారు. 'చిరంజీవి లక్ష్మణ రేఖనైనా దాటుతారేమో కానీ.. సురేఖను మాత్రం దాటరు' అంటూ నవ్వించారు. 'చూడాలని ఉంది' అనే చిత్రంలోని ఓ సీన్​ను షోలో రీక్రియేట్ చేయాలని సుమ అడగ్గా.. అందుకు చిరు వెంటనే రెడీ అంటారు. అయితే, తనను హీరోయిన్​ అంజలీ జవేరీగా అనుకోవాలని సుమ అంటారు. దీనికి చిరు నిట్టూర్పు వ్యక్తం చేస్తూ.. 'ఇలాంటి రోజు వస్తుందని జీవితంలో ఊహించలేదు' అంటూ పంచ్ విసిరారు. దీంతో సుమ సహా షోలో ఉన్నవారంతా పగలబడి నవ్వారు. సుమకు లైన్ వేస్తున్నట్లు నటించి.. సుమ లేవగానే అంధుడిలా చిరు లేచి నిలబడటం ప్రోమోకే హైలైట్. శనివారం రాత్రి 9.30 గంటలకు ఈటీవీలో ఈ షో ప్రసారం కానుంది.

ABOUT THE AUTHOR

...view details