ETV Bharat / entertainment

'థ్యాంక్యూ చిరు సర్.. ఈ మూమెంట్​ను ఎప్పటికీ మర్చిపోలేను'.. అడవి శేష్​ ఎమోషనల్​ పోస్ట్​!

author img

By

Published : Jan 8, 2023, 2:21 PM IST

వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్​ హీరో అడివి శేష్‌ తాజాగా మేజర్‌ సినిమాకు గాను సంతోషం అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా అందుకున్న ఆయన ఈ సందర్భంగా ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్​ పోస్ట్‌ పెట్టారు.

Advi Sesh Santhosham Award
Adivi Sesh

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుతెచ్చుకున్నారు అడివి శేష్‌. తాజాగా హిట్‌2తో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇకుపోతే మేజర్‌ సినిమాకు గాను తాజాగా సంతోషం అవార్డును అందుకున్నారు. తన ఆనందాన్ని సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నాడు ఈ హీరో. చిరంజీవి చేతుల మీదగా అవార్డును అందుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసిన అడివి శేష్‌ చిరంజీవిని ఉద్దేశిస్తూ పోస్ట్‌ పెట్టారు.

"నా చిన్నతనంలో మీ సినిమా టికెట్ల కోసం కొట్టుకునే వాళ్లం. ఆ రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇక మేజర్‌ సినిమా కోసం ఒకరోజు మధ్యాహ్నం అంతా మీతో గడపడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పుడు మీ చేతుల మీదుగా ఆ సినిమాకు వచ్చిన అవార్డును అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.. మాటల్లో చెప్పలేకపోతున్నాను. జీవితాంతం నాకు గుర్తుండిపోయే స్పెషల్ మూమెంట్​ ఇది, థ్యాంక్యూ చిరంజీవి సర్".. అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌ చూసిన నెటిజన్లు అడివి శేష్‌ను ప్రశంసిస్తున్నారు. మేజర్‌ అనేది ఓ సినిమా కాదు.. అది ఒక ఎమోషన్‌ అని కామెంట్స్‌ పెడుతున్నారు.

గతేడాది మేజర్, హిట్‌2 రెండు సినిమాలతో బ్లాక్‌బాస్టర్‌లతో విజయాలు సొంతం చేసుకున్న అడివి శేష్​ ఇటీవలే తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. తన కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన గూఢచారి సినిమా సీక్వెల్‌ను త్వరలోనే సెట్స్​ పైకి తీసుకెళ్తునట్లు తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.