తెలంగాణ

telangana

తిలకం తెచ్చిన తంటా.. చిక్కుల్లో మణిరత్నం, విక్రమ్​.. నోటీసులు పంపిన కోర్టు!

By

Published : Jul 18, 2022, 3:48 PM IST

Updated : Jul 18, 2022, 9:36 PM IST

ప్రముఖ దర్శకుడు మణిరత్నం, హీరో విక్రమ్​పై ఓ న్యాయవాది పలు ఆరోపణలు చేశారు. కోర్టును ఆశ్రయించి.. వారికి నోటిసులు పంపారు. ఇంతకీ ఏం జరిగిందంటే...

ponniyan selvan
పొన్నియన్ సెల్వన్​

Maniratnam Vikram court summons: ప్రముఖ దర్శకుడు మణిరత్నం, హీరో విక్రమ్​కు ఓ న్యాయవాది నోటీసులు పంపారు. చోళ సామ్రాజ్యం నేపథ్యంలో తెరకెక్కుతోన్న 'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రంలో చోళులను తప్పుగా చిత్రీకరించేలా సన్నివేశాలున్నాయని ఆరోపిస్తూ సెల్వమ్‌ అనే న్యాయవాది తాజాగా కోర్టును ఆశ్రయించారు.

ఇప్పటివరకూ విడుదలైన 'పొన్నియిన్‌ సెల్వన్‌' ప్రచార చిత్రాలు చూసుకుంటే విక్రమ్‌ పోషించిన కరికాలన్‌ పాత్రకు పోస్టర్లలో తిలకం పెట్టినట్లు చూపించారని.. టీజర్‌లో ఎలాంటి తిలకం కనిపించలేదని.. కాబట్టి, ఈ సినిమా చోళ రాజులను తప్పుగా అభివర్ణించే అవకాశం ఉందంటూ సెల్వమ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అంతేకాకుండా, సినిమా విడుదలకంటే ముందు తన కోసం ప్రత్యేకంగా స్పెషల్‌ షో వేయాలని కోరుతూ మణిరత్నం, విక్రమ్‌లకు నోటీసులు పంపారు. దీంతో పొన్నియిన్​ సెల్వన్​ వివాదాల్లో చిక్కుకున్నట్లైంది.

కల్కి కృష్ణమూర్తి రచించిన 'పొన్నియిన్ సెల్వన్' నవల ఆధారంగా చేసుకుని మణిరత్నం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఐశ్వర్య రాయ్‌, విక్రమ్‌, జయం రవి, కార్తి, త్రిష ఇందులో కీలకపాత్రలు పోషించారు. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

ఇదీ చూడండి:సుస్మితా సేన్​ 'గోల్డ్‌ డిగ్గర్‌'.. వారిపై మాజీ విశ్వ సుందరి కౌంటర్​

Last Updated : Jul 18, 2022, 9:36 PM IST

ABOUT THE AUTHOR

...view details